Viral Video: చెల్లికి అన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న చెల్లెలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

అన్నాచెల్లెళ్ల ప్రేమకు హద్దులుండవంటారు. ఈ వీడియో చూస్తే నిజమే అనిపించకమానదు. ఒక చెల్లికి అన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది చూడగానే ఆ చెల్లి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.

Viral Video: అన్నాచెల్లెళ్ల బంధం స్వచ్ఛమైంది. పుట్టినప్పటి నుంచి జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారు. చిన్నప్పుడు ఎంతగా అల్లరిచేస్తూ, గొడవలు పడతారో… పెద్దయ్యాక అంతగా తమ ప్రేమను చాటుకుంటారు.

PM Modi-Pawan kalyan Letter : ప్రధాని మోడీకి పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ .. ఏఏ అంశాలున్నాయంటే..

కొన్నిసార్లు తమ తోబుట్టువులకు కానుకలు ఇస్తూ కూడా తమ ప్రేమను చాటుకుంటారు. తాజాగా ఒక అన్న.. తన చెల్లికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ పోస్ట్ ప్రకారం.. ఒక అన్నయ్య తన చెల్లికి గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్‌లో ఏదైనా చిన్న వస్తువు ఉంటుందని ఓపెన్ చేసిన ఆ చెల్లికి అందులో బైక్ కీ కనిపించింది. అది తనకోసమే అని తెలుసుకోగానే పట్టరాని ఆనందానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నయ్యను హత్తుకుంది.

PM Modi In Telangana : నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే అలిసిపోను : ప్రధాని మోడీ

ఎంతో భావోద్వేగానికి గురైన తాను తర్వాత బైక్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోకు నెటిజన్లు సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయంటే ఇది ఎంతగా నెటిజటన్లను ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు