Vivo X100 Ultra : వివో X100 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కెమెరా ఫీచర్లు లీక్..!

Vivo X100 Ultra Camera : ప్రపంచంలోనే అత్యంత బలమైన పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌గా పేర్కొంది. ఈ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ Zeiss ఏపీఓ సర్టిఫికేషన్‌తో వస్తుంది.

Vivo X100 Ultra Camera : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. మే 13న వివో ఎక్స్100 అల్ట్రా అధికారికంగా లాంచ్‌ కానుంది. దీనికి సంబంధించి ఫీచర్లు ఆన్‌లైన్‌లో రివీల్ అయ్యాయి. అదనంగా, వివో వైస్ ప్రెసిడెంట్ జియా జింగ్‌డాంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు.

వివో ఎక్స్100 అల్ట్రా బ్యాక్ సైడ్ శాంసంగ్ 200ఎంపీ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ9 కెమెరా సెన్సార్‌తో వస్తుంది. సోనీ లేటెస్ట్ లైటా ఎల్‌వైటీ-900, 1-అంగుళాల సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. వివోఎక్స్100 అల్ట్రా ఫోన్, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రోతో పాటుగా ఆవిష్కరించనుంది.

Read Also : WhatsApp Update : వాట్సాప్‌ యూజర్ల కోసం కొత్త డిజైన్ వచ్చేసిందోచ్.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

జియా జింగ్‌డాంగ్, వెయిబో పోస్ట్ ద్వారా వివో ఎక్స్100 అల్ట్రా శాంసంగ్ 200ఎంపీ ఐఎస్ఓసెల్ హెచ్‌పీ9 సెన్సార్‌తో వస్తుందని ప్రకటించింది. ఈ సెన్సార్‌ను వివో, శాంసంగ్ సంయుక్తంగా డెవలప్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌గా పేర్కొంది. ఈ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ Zeiss ఏపీఓ సర్టిఫికేషన్‌తో వస్తుంది.

కెమెరా వివరాలు (అంచనా) :
ఇంకా, వివో ఎక్స్100 అల్ట్రా కెమెరా యూనిట్‌లో సీఐపీఏ 4.5 స్థాయి గింబల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన సోనీ 1-అంగుళాల ఎల్‌వైటీ900 50ఎంపీ సెన్సార్ కూడా ఉంటుంది. వివో అధికారికంగా వెయిబోలో కెమెరా ఫీచర్లను రిలీజ్ చేయనుంది. రాబోయే వివో ఎక్స్100 అల్ట్రా కెమెరాలను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఇంటర్నల్‌గా వివో ‘Thanos’ అనే కోడ్‌నేమ్‌తో డెవలప్ చేసింది.

అదనంగా, వివో ఎక్స్100 అల్ట్రాలో పిక్సెల్ లైట్ సెన్సిటివిటీని ఆప్టిమైజ్ చేసేందుకు వివో సెకండ్ జనరేషన్ వీసీఎస్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని చైనీస్ మీడియా అవుట్‌లెట్ నివేదించింది. ఏకైక ఫ్లోరైట్-గ్రేడ్ గ్లాస్ లెన్స్, ఎఫ్‌సీడీ100ని ఉపయోగిస్తుంది. ఈ ఎఫ్‌సీడీ100 ఫీచర్ గతంలో సోనీ ప్రొఫెషనల్ కెమెరాలలో ఉండేది. ఈ హ్యాండ్‌సెట్ మూడో 50ఎంపీ ఎల్‌వైటీ600 అల్ట్రా-వైడ్-యాంగిల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది సెకనుకు 60 ఫ్రేమ్‌ల వద్ద 4కె వీడియో క్యాప్చర్‌ చేయగలదు. 50ఎంపీ ఐఎస్ఓసెల్ జేఎన్1 సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.

ప్రస్తుతం చైనాలో వివో ఎక్స్100 అల్ట్రా ఫోన్ స్పేస్ గ్రే, టైటానియం, వైట్ మూన్‌లైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. వివో ఎక్స్100తో పాటు మే 13న ప్రకటించనుంది. చైనాలో స్థానిక కాలమానం ప్రకారం.. లాంచ్ ఈవెంట్ సాయంత్రం 7 గంటలకు జరగనుంది. వివో ఎక్స్100 అల్ట్రా ఈ నెల 28న సేల్ ప్రారంభం కానుండగా, మొత్తం 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో విక్రయించనుంది. 12జీబీ+ 256జీబీ, 16జీబీ+512జీబీ, 16జీబీ + 1టీబీతో పాటు స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఎస్ఓసీలో రన్ అవుతుంది.

Read Also : Vivo Y200 5G Series : ఈ నెల 20నే వివో Y200 5జీ సిరీస్ లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? వివో Y200 GT 5జీ డిజైన్ ఇదిగో!

ట్రెండింగ్ వార్తలు