Vivo Y200 5G Series : ఈ నెల 20నే వివో Y200 5జీ సిరీస్ లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే? వివో Y200 GT 5జీ డిజైన్ ఇదిగో!

Vivo Y200 5G Series : రాబోయే లాంచ్‌కు సంబంధించిన అధికారిక పోస్ట్ వివో వై200 జీటీ 5జీ డిజైన్‌ను కూడా వెల్లడించింది. బ్యాక్ ప్యానెల్ ఐక్యూ Z9 మాదిరిగానే ఉండవచ్చునని నివేదికలు సూచిస్తున్నాయి.

Vivo Y200 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త వివో Y200 5జీ సిరీస్ త్వరలో చైనాలో ఆవిష్కరించనుంది. కంపెనీ లాంచ్ తేదీని ధృవీకరించింది. ఈ మోడల్‌లలో ఒకటైన వివో వై200 జీటీ 5జీ డిజైన్‌ను వెల్లడించింది. రీబ్రాండెడ్ ఐక్యూ Z9 అని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో ఏప్రిల్‌లో చైనాలో లాంచ్ చేసింది. ఇతర మోడల్ వివో వై200టీ, అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాబోయే హ్యాండ్‌సెట్‌లు వివో వై200ఐ లైనప్‌లో చేరవచ్చనని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో కూడా లాంచ్ అయింది.

వెయిబో పోస్ట్‌లో వివో వై200 జీటీ 5జీ చైనాలో మే 20న లోకల్ టైమ్ మధ్యాహ్నం 2:30 గంటలకు రానుందని కంపెనీ ధృవీకరించింది. వివో వై200 5జీ సిరీస్‌ను అధికారిక మైక్రోసైట్ అందించనుంది. వివో వై200 జీటీ 5జీ రిజర్వేషన్లు ఓపెన్ ఉన్నాయని కూడా ప్రకటించింది. అయితే, ఇంకా ఏ ఇతర మోడల్స్‌ను విడుదల చేయనున్నారో కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వివో వై200టీ లైనప్‌లోని హ్యాండ్‌సెట్‌లలో ఒకటిగా ఉంది.

వివో వై200 5జీ సిరీస్ స్పెషిషికేషన్లు (అంచనా) :
రాబోయే లాంచ్‌కు సంబంధించిన అధికారిక పోస్ట్ వివో వై200 జీటీ 5జీ డిజైన్‌ను కూడా వెల్లడించింది. బ్యాక్ ప్యానెల్ ఐక్యూ Z9 మాదిరిగానే కనిపిస్తుంది. కొత్త హ్యాండ్‌సెట్ ఐక్యూ మోడల్ వెర్షన్‌గా ఉండవచ్చు. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ రౌండెడ్ ఎడ్జ్‌లతో చతురస్రాకార మాడ్యూల్‌తో కనిపిస్తుంది. ఎలిప్టికల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కెమెరా ఐలండ్ పక్కన వర్టికల్ సూచిస్తుంది.

వివో వై200 జీటీ 5జీ ఫోన్ ఐక్యూ Z9 రీబ్యాడ్జ్ వెర్షన్ అయితే, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 ఎస్ఓసీ, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ రియర్ సెన్సార్‌తో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్, 16ఎంపీ సెల్ఫీ షూటర్ పొందవచ్చని భావిస్తున్నారు. 6.78-అంగుళాల 144హెచ్‌జెడ్ ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది.

ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఆర్జిన్ఓఎస్ 4తో రానుందని కూడా భావిస్తున్నారు. వివో వై200టీ మోడల్.. మరోవైపు, రీబ్రాండెడ్ ఐక్యూ Z9x ఫోన్ పేరుతో రానుంది. 6.72-అంగుళాల 120హెచ్‌జెడ్ ఫుల్-హెచ్‌‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ఎస్ఓసీ, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీ, ఏఐ-బ్యాక్డ్ 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాతో రావచ్చు.

Read Also : WhatsApp Update : వాట్సాప్‌ యూజర్ల కోసం కొత్త డిజైన్ వచ్చేసిందోచ్.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు