Dairy Management : గేదెల డెయిరీ నిర్వాహణలో రిటైర్డ్ ఇంజనీర్.. పాలను డోర్ డెలివరీ చేస్తూ లాభాలు

2020 ఫిబ్రవరిలో 4 గేదెలతో డైరీని ప్రారంభించారు. నేడు ఈ డైరీ 18 గేదెలతో పాటుగా రెండు ఆవులతో కళ కళలాడుతోంది. రోజుకు 80 లీటర్ల వరకూ స్వచ్ఛమైన పాల దిగుబడి తీస్తూ... డోర్ డెలివరీ విధానంలో విక్రయిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

Running Dairy

Dairy Management : ఉద్యోగులు విధి నిర్వహణలో వయసును పణంగా పెడుతుంటారు. తీవ్ర ఒత్తిళ్లతోనే ఉద్యోగ కాలం ముగించేస్తారు. రిటైరైన తర్వాత ప్రశాంతంగా సేద తీరుతుంటూ ఉంటారు.. అయితే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ఇంజనీర్.. రిటైర్డ్ నా ఉద్యోగానికే కా.. వయస్సుకు కాదంటున్నారు. తనకున్న స్థంలంలో గేదెల డెయిరీ నిర్వహిస్తూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

READ ALSO : Seeding Cultivation Techniques : సంప్రదాయ పద్ధతిలో ప్రోట్రేలలో నారు పెంపకం

వ్యవసాయ అనుబంధ పరిశ్రమమైన పాడి పరిశ్రమ నేడు గ్రామాలలో కనుమరుగవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో గ్రామాలలో ప్రతి రైతు ఇంటి ముందు  ఒకటి గాని రెండు గాని గేదెలు ఉండేవి. వాటి ద్వారా వచ్చే పాల ఉత్పత్తులతో రైతుల జీవనోపాధి కొంతవరకు గట్టెక్కేది. కాని రాను రాను గ్రామాలలో వరిసాగు కనుమరుగై ఆక్వారంగం అభివృద్ధి చెందడంతో పశువుల మేత కరువైంది.

READ ALSO : Organ Donation : అవయవ దానం సమయంలో ముందస్తుగా నిర్వహించే పరీక్షలు ఇవే !

ఈ తరుణంలో రైతులు ఎక్కువ శాతం మంది పాడిని వదులుకున్నారు. దీంతో దాదాపు 90 శాతం మంది ప్రజలు ప్యాకెట్ పాలు పైనే ఆధారపడ్డారు. కాని సివిల్ ఇంజనీరింగ్ చదివి ఉన్నత స్థాయికి చేరుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న  పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలం, కొమరాడ గ్రామానికి చెందిన రైతు మద్దాల వెంకట సత్య నరసింహారావు మాత్రం తనకు చిన్నప్పటినుండి ఇష్టమైన పాడిపరిశ్రమపై దృష్టిసారించారు. 2020 ఫిబ్రవరిలో 4 గేదెలతో డైరీని ప్రారంభించారు. నేడు ఈ డైరీ 18 గేదెలతో పాటుగా రెండు ఆవులతో కళ కళలాడుతోంది. రోజుకు 80 లీటర్ల వరకూ స్వచ్ఛమైన పాల దిగుబడి తీస్తూ… డోర్ డెలివరీ విధానంలో విక్రయిస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

డెయిరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నదే… కానీ ముందు చూపుతో ఒక లెక్కతో, పక్కాగా పశుపోషణ నిర్వహిస్తే, కష్టానికి తగిన ప్రతిఫలం పొందవచ్చు. శాస్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతేనే విజయం తమ వెంటే ఉంటుందని నిరూపిస్తున్నారు రైతు నరసింహారావు.

ట్రెండింగ్ వార్తలు