Maize Crop : మొక్కజొన్నలో కత్తెర పురుగు.. నివారణ పద్ధతులు

Maize Crop : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. అయితే ఇప్పటికే వేసిన మొక్కజొన్న పంట లేత దశలో ఉంది.  రైతులు చీడపీడలు, కలుపు సమస్యలపై సరైన దృష్టి సారించాలి.

Control of Cutworm in Maize Crop

Maize Crop : తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు రైతులు మెట్టపంటలను విత్తారు . కొన్ని చోట్ల విత్తేందుకు సిద్దమవుతున్నారు.  అడపాదడప కురుస్తున్న వర్షాలకు చీడపీడలు ఆశించడమే కాకుండా , సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెరపురుగు ఉధృతి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ప్రస్తుత ఉన్న పంటలో, ఇప్పుడు వేయబోయే పంటల్లో తొలిదశలోనే ఈ పురుగును నివారించించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. అయితే ఇప్పటికే వేసిన మొక్కజొన్న పంట లేత దశలో ఉంది.  రైతులు చీడపీడలు, కలుపు సమస్యలపై సరైన దృష్టి సారించాలి. ముఖ్యంగా ప్రస్తుతం మొక్కజొన్నను పీడిస్తున్న సమస్య కత్తెర పురుగు. పంట వేసిన మొదలు కోత కోసే వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి.  ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త నాగరాజు.

Read Also : Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

ట్రెండింగ్ వార్తలు