Kharif Castor Cultivation : ఖరీఫ్‌కు అనువైన ఆముదం రకాలు.. సాగు యాజమాన్యం

Kharif Castor Cultivation : నూనెగింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేకస్థానం. బీడు, బంజరు భూముల్లో  సైతం  రైతులు ఆముదాన్ని సాగుచేసి, ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకుంటున్నారు.

Kharif Castor Cultivation

Kharif Castor Cultivation : ఏ పంటా లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని చెబుతారు. కానీ ఇది ఒకప్పటి మాట. ఆముదం పంట కూడా మంచి వ్యాపార విలువతో ఆశాజనకమైన ఫలితాలను అందిస్తోంది. అందుకు తగ్గట్టుగానే హైబ్రీడ్ రకాలు అందుబాటులోకి రావడంతో చాలా మంది రైతులు ఆముదం సాగుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త నళిని.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

నూనెగింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేకస్థానం. బీడు, బంజరు భూముల్లో  సైతం  రైతులు ఆముదాన్ని సాగుచేసి, ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకుంటున్నారు. దీనినుండి వస్తున్న నూనెను వివిధ పరిశ్రమలలో ముడిసరుకుగా ఉపయోగిస్తున్నారు. అందుకే దీనిని  ఇండస్ర్టియల్ ఆయిల్  అంటారు. ఖరీఫ్ లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తుంటారు రైతులు.

గతంలో దిగుబడులు తక్కువగా వుండి, ఆదాయం నిరాశాజనకంగా వుండటంతో… ఇతర పంటల సాగుకు మొగ్గిన రైతాంగం.. అధిక దిగుబడులిచ్చే అనేక సంకర రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో మళ్ళీ దీనిసాగుకు  ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వర్షాధారంగా సాగుచేసే రైతులు రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే అధిక దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, శాస్త్రవేత్త నళిని.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు