Management of insect pests of cotton
Pests of Cotton : ప్రస్తుతం తెగులు రాష్ట్రాల్లో పత్తి పైరు వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల ఇంకా విత్తుతనే ఉన్నారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు పత్తిలో కలుపు పెరిగిపోయింది. కొన్ని చోట్ల పంట బెట్టకు గురైంది. అయితే పత్తిలో తొలిదశ ఆశించే రసంపీల్చే పురుగులు తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పప్పుడు చూద్దాం..
ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు పలకరించాయి. కానీ సరిపడా వర్షాలు కురవలేదు. ముందుగా వేసిన పత్తి గింజలు కొన్ని చోట్ల ఎండిపోగా.. మళ్లి వేస్తున్నారు. మరికొన్ని చోట్ల బెట్టకు గురై ఎదుగుదల లేవు. అడపాదడపా పడుతున్న వర్షాలకు రైతులు ఇప్పుడిప్పుడే పత్తి విత్తుతున్నారు.
అయితే, పత్తి పంటకు తొలిదశ రసంపీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. వీటి వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయి, దిగుబడులపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శైల.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు