CM Jagan : 2024 ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యం..వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్ధేశం

ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కేడర్ కు జగన్ పిలుపు ఇచ్చారు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేలా జగన్ ప్రసంగించారు. కౌరవ సైన్యాన్ని ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర మీదే అంటూ ఉత్సాహపరిచారు.

CM Jagan : వైసీపీ శాశ్వత అధ్యక్షుడు, సీఎం జగన్ ప్లీనరీ ముగింపు సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ప్లీనరీ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. పార్టీ శ్రేణులకు జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. 2024 ఎన్నికల్లో 175 సీట్లు లక్ష్యం అన్నారు. అంతా కలిసి పనిచేస్తే 175 సీట్లు సుసాధ్యమే అని చెప్పారు. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కేడర్ కు జగన్ పిలుపు ఇచ్చారు. కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేలా జగన్ ప్రసంగించారు. కౌరవ సైన్యాన్ని ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర మీదే అంటూ ఉత్సాహపరిచారు. పార్టీ నాయకత్వంతో కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలన్నారు. దుష్ట చతుష్టయం కుట్రలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలన్నారు.

Jagan : వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఏకగ్రీవ ఎన్నిక

టీడీపీ అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా తిప్పి కొట్టాలని సూచించారు. చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. చక్రాలు లేని సైకిల్ ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారని చెప్పారు. టీడీపీ నేతలకు డిపాజిట్లు కూడా దక్కవని తెలిసే ఏపీ శ్రీలంక అవుతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు