ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్.. నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గడచిన నాలుగు ఫేజెస్ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ అని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.

Andhra Pradesh Election 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని, గత 4 విడతల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. అమరావతిలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో పోలింగ్ వివరాలు వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ జరిగిందన్నారు. అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం ఓటింగ్ నమోదయినట్టు చెప్పారు.

నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆయన ఇంకా ఏమన్నారంటే..

సాయంత్రం 6 తర్వాత 3500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.
రాత్రి 2 గంటలవరకూ పోలింగ్ జరిగింది.
నిన్న రాత్రి వరకూ సీల్ చేసే ప్రక్రియ జరిగింది.
పరిశీలకులు నుంచి రీ పోలింగ్ కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.

33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేశాం.
మొత్తం 3,33,40,560 మంది పార్లమెంట్ స్థానాలకు ఓటు వేశారు.
అసెంబ్లీ కి 3,33,40,333 మంది ఓటు వేశారు.
మొత్తం 80.66 శాతం పోలింగ్ నమోదైంది.

4,97,000 మంది పోస్టల్, హోం బ్యాలెట్ వినియోగించుకున్నారు.
మొత్తం మీద 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ నమోదు.
రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది.
దేశంలో అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏపీ.
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పెరగడం మంచి సంకేతం.

పోల్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలో హింసాత్మక ఘటనలు జరిగాయి.
నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టాం..అదనపు బలగాలు పంపించాం.
అభ్యర్ధులు అందరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చాం.
ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం.

EVMలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని అదేశాలిచ్చాం.
ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.
రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశాం.