Andhra Pradesh Election 2024 Polling: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 33,340,560 ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో 33,340,333 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభకు 227 ఓట్లు అధికంగా వచ్చాయి.
ఇక రాష్ట్రంలోని ప్రధాన 5 పార్టీల అగ్రనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదయిందనే దానిపై ఓటర్లకు ఆసక్తి నెలకొంది. నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలను ఈసీ విడుదల చేయడంతో ఫుల్ డిటైల్స్ అందుబాటులోకి వచ్చాయి. పులివెందులలో సీఎం జగన్, కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేశారు. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి, కడప నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేసిన సంగతి తెలిసిందే.
నియోజకవర్గాల వారీగా పోలింగ్, ఇతర వివరాలు..
పులివెందుల
పోలింగ్ శాతం: 81.34
పోలైన ఓట్లు: 186,833
మహిళలు: 95,339
పురుషులు: 91,484
ఇతరులు: 10
……………………………….
కుప్పం
పోలింగ్ శాతం: 89.88
పోలైన ఓట్లు: 202,920
మహిళలు: 101,608
పురుషులు: 101,306
ఇతరులు: 6
……………………………….
పిఠాపురం
పోలింగ్ శాతం: 86.63
పోలైన ఓట్లు: 204,811
మహిళలు: 101,438
పురుషులు: 103,370
ఇతరులు: 3
……………………………….
కడప లోక్‌సభ
పోలింగ్ శాతం: 79.57
పోలైన ఓట్లు: 1,406,880
మహిళలు: 712,401
పురుషులు: 694,417
ఇతరులు: 87
……………………………….
రాజమండ్రి
పోలింగ్ శాతం: 80.93
పోలైన ఓట్లు: 1,313,630
మహిళలు: 666,081
పురుషులు: 647,491
ఇతరులు: 58