Banks Holidays: బీ అలర్ట్.. ఈ వారంలో బ్యాంకులకు 6 రోజులు సెలవులు..!

వరస పండుగల ప్రభావంతో.. ఇవాల్టి నుంచి వచ్చే ఆదివారం వరకూ.. చాలా ప్రాంతాల్లో లోకల్ పండగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

వరుసగా వచ్చిన పండుగల ప్రభావం.. దేశ వ్యాప్తంగా బ్యాంకులపై కంటిన్యూ అవుతోంది. ఇవాల్టి నుంచి వచ్చే ఆదివారం వరకూ.. చాలా ప్రాంతాల్లో లోకల్ పండగల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇవాళ అసోంలో కాటి బిహూ పండగ కారణంగా.. ఆ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. 19న మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.

20న వాల్మీకీ జయంతి సందర్భంగా కర్ణాటక, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెవు. 22న ఈద్ ఇ మిలాద్ ఉల్ నబీ.. కారణంగా జమ్మూ శ్రీనగర్ లోని బ్యాంకులకు సెలవు. ఇక.. 23న ఈ నెలలో నాల్గో శనివారం, 24న ఆదివారం కారణంగా.. బ్యాంకులన్నీ బంద్.

ఓవరాల్ గా.. 18 నుంచి 24 వరకు.. దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో 6 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఆన్ లైన్ సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు. కానీ.. బ్రాంచ్ లకు వెళ్లి లావాదేవీలు చేసుకునేవారు మాత్రం.. ఈ వారం అప్రమత్తం కావాల్సిందే. వారు వెళ్లాలనుకున్న రోజు.. బ్యాంకు పని చేస్తుందో లేదో తెలుసుకుని వెళ్లాల్సిందే.

Read More:

Bank Holidays : బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులు

Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు

ట్రెండింగ్ వార్తలు