AP CID Searches : ఏపీ మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు.

AP CID Searches : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూముల కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. దాదాపు 146 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. పక్కా ఆధారాలతో సోదాలు చేస్తున్నట్టుగా సీఐడీ వర్గాలు వెల్లడించాయి. ఈ సోదాల్లో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలన్నింటీపై కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మనీ రూటింగ్‌కు పాల్పడి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు గతంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో గతంలో మాజీ మంత్రి నారాయణ నివాసాలపై కూడా సీఐడీ అధికారులు సోదాలు చేసి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి నారాయణ కుమార్తె నివాసంలోనూ ఏపీ సీఐడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

TDP Leader Narayana : ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..!

అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించి అవకతవకలు జరిగాయన్న ప్రధాన అభియోగాలతో గతంలో ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పలువురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత పలువురి నివాసాల్లో సోదాలు చేశారు. నారాయణ కూతురిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె నివాసంలో కూడా ఉదయం నుంచి సీఐడీ అధికారులు కంటిన్యూగా సోదాలు కొనసాగిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు