YS Jagan
YS Jagan Election Campaign : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచార యాత్ర ఇవాళ తిరిగి ప్రారంభం కానుంది. గురువారం యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్.. ఇవాళ ఎన్నికల ప్రచారంను కొనసాగించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ అభ్యర్థుల విజయంకోసం సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం చుట్టొచ్చిన జగన్.. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది.
Also Raed : Ap Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. భూ యజమానులకు జరిగే మేలేంటి..?
జగన్ ప్రచార యాత్ర ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నర్సాపురం లోక్ సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమెర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు నర్సరావుపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న క్రోసూరు సెంటర్ లో జరిగే సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరికి జగన్ వెళ్తారు. అక్కడ పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడతారు.
Also Read : Asaduddin Owaisi : ఏపీలో జగన్‌నే గెలిపించండి.. ఎందుకంటే- అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సభా వేదికలపై వైసీపీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. వైసీపీ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయాలో జగన్ వివరించనున్నారు. మరోవైపు సీఎం జగన్ సభలకు స్థానిక వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ సభలకు ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అందుకు తగ్గట్లుగా ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ నేతలు సభా ఏర్పాట్లను చేశారు.