Asaduddin Owaisi : ఏపీలో జగన్‌నే గెలిపించండి.. ఎందుకంటే- అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రజలు చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi : ఏపీలో జగన్‌నే గెలిపించండి.. ఎందుకంటే- అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

Updated On : May 2, 2024 / 9:44 PM IST

Asaduddin Owaisi : ఏపీ ఎన్నికలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. జగన్ గెలిస్తే రిజర్వేషన్లు కాపాడతారని, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు జగన్ కృషి చేస్తారని చెప్పారు. ఏపీ ప్రజలు చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించగలరా? అంటూ ప్రశ్నించారు ఓవైసీ. మే 13న వైసీపీకే ఓటు వేయాలని, జగన్ ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు అసదుద్దీన్ ఓవైసీ.

తన వ్యాఖ్యలతో ఏపీలో ఎంఐఎం మద్దతు ఎవరికో తేల్చేశారు ఓవైసీ. జగన్ కే తమ మద్దతు అని ఓపెన్ గా ప్రకటించిన అసద్.. జగన్ కు మాత్రమే ముస్లిం రిజర్వేషన్లు కాపాడే ధైర్యం ఉందన్నారు. మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు ఓవైసీ. చంద్రబాబు గెలిస్తే మోదీకి కీలుబొమ్మగా మారతారని ఆరోపించారు. మోదీని ఢీకొట్టే సత్తా జగన్ కు మాత్రమే ఉందన్నారు. జగన్ కు ఓటేసి గెలిపించాలని ఏపీ ఓటర్లకు పిలుపునిచ్చారు ఓవైసీ.

Also Read : నేను చెప్పింది తప్పు అయితే జైలుకి వెళ్లేందుకు సిద్ధం- కేటీఆర్ సంచలనం