Kodali Nani Interesting Comments : అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూ.ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని పేర్కొన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని భావిస్తున్నట్లు వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Kodali Nani Interesting Comments : బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూ.ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని పేర్కొన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని భావిస్తున్నట్లు వెల్లడించారు. జూ.ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పాన్ ఇండియా స్టార్ అయిన జూ.ఎన్టీఆర్ తో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయించే అవకాశం ఉందన్నారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ సమావేశం అయ్యారు. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది. ఈ ఇద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయింది. బీజేపీ అగ్రనేతను జూ.ఎన్టీఆర్‌ కలవడం ఆసక్తికరంగా మారింది. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ ఏ ఏ అంశాలపై చర్చించారనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ వర్గాలు మాత్రం ఇది రాజకీయ భేటీ కాదంటున్నాయి. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాలో జూ.ఎన్టీఆర్ అద్భుత నటనను అమిత్‌ షా ప్రశంసించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఇంకా ఏ ఏ అంశాలపై చర్చించి ఉంటారనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

Amit Shah Meets Jr NTR : అమిత్ షాతో ముగిసిన జూ.ఎన్టీఆర్ భేటీ.. ఏం చర్చించుకున్నారంటే..

తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. సినీ గ్లామర్ ను వినియోగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా జూ.ఎన్టీఆర్ ను తమవైపు అట్రాక్ట్ చేసే పనిలో పడింది. హైదరాబాద్ లో ఉండే ఏపీ సెటిలర్స్ ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలంటే సెటిలర్ల ఓట్లు చాలా కీలకం. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో రాజకీయ బలంతో పాటు సినీ గ్లామర్ ను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఎవరితో భేటీ అయినా దానికి కచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. బీజేపీకి ఉపయోగపడే విధంగా ఆయన చర్చలు జరుపుతారు.

ట్రెండింగ్ వార్తలు