Bonda Uma: మహిళలకు భద్రత కల్పించాలంటూ బోండా ఉమ ధర్నా

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో బుధవారం ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని, దిశ చట్టం పేరుతో్ ప్రభుత్వం ఆర్భాటం చేయడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని బోండా ఉమ ఆరోపించారు.

Bonda Uma: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో బుధవారం ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో మహిళలపై దారుణాలు పెరిగిపోయాయని, దిశ చట్టం పేరుతో్ ప్రభుత్వం ఆర్భాటం చేయడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని బోండా ఉమ ఆరోపించారు. ఎన్ని కేసులలో ఎంతమందికి శిక్షలు వేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘మహిళలకు న్యాయం చేయాల్సిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగితే వెంటనే ఎందుకు స్పందించలేదు.

Andhra Pradesh : బాబు, బోండా ఉమా విచారణకు రావాలన్న మహిళా కమిషన్

చంద్రబాబు వచ్చిన సమయంలో మీరంతా ఎందుకు వచ్చారు? మూడు రోజులపాటు నిద్రపోయారా? బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆగ్రహించి, మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తే, టీడీపీ నేతలు ధర్నాకు పంపించారని ఆరోపించడం సిగ్గు చేటు. మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం జరిగితే మొదట స్పందించింది టీడీపీ నేతలే. ఆ తరువాత వైసీపీ నేతలు వచ్చి ఆసుపత్రి వద్ద హంగామా చేశారు. మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్‌కు లేదు. నోటీసులకు భయపడం. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తాం. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం’’ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు