Cannabis Smuggler : విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్‌చల్

విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్‌చల్‌ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు చెక్‌పోస్ట్ నుంచి తప్పించుకునేందుకు బైక్‌తో గేట్‌ను ఢీ కొట్టారు. ఈఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

Cannabis Smuggler : విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్‌చల్‌ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు చెక్‌పోస్ట్ నుంచి తప్పించుకునేందుకు బైక్‌తో గేట్‌ను ఢీ కొట్టారు. ఈఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

అనంతగిరి మండలం చిలకలగడ్డ చెక్‌పోస్ట్‌ వద్ద ఈరోజు ఉదయం బైక్‌పై గంజాయి రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఆ మార్గంలోవెళుతున్నారు. చెక్ పోస్టు వద్ద ఉండే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైక్‌తో గేట్‌ను ఢీకొట్టారు. దీంతో గంజాయి బ్యాగుతో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కింద పడ్డాడు. అతనికి తీవ్ర గాయలవ్వడంతో ఎస్‌. కోట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో స్మగ్లర్‌ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

విజయనగరం జిల్లా ఎస్‌కోట, విశాఖజిల్ల అనంతగిరి మండలాల మధ్య ఈఘటన చోటు చేసుకుంది. ఈ మార్గంలో తరచూ గంజాయిస్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. స్మగ్లింగ్ ను నిరోధించేందుకు అటవీశాఖ అక్కడ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసింది. ఈరోజు ఉదయం కూడా అక్కడ పోలీసులు ఉంటారనే భయంతో… వారిని తప్పించుకుని వెళ్లేందుకు స్మగ్లర్లు యత్నించారు.

ఈక్రమంలో బైక్ నడుపుతున్న వ్యక్తి చాకచక్యంగా తప్పించుకోగా, వెనుక కూర్చున్న వ్యక్తి గేట్ తగిలి గంజాయి బ్యాగ్‌తో సహా కింద పడ్డాడు. అతడ్ని చూసిన పోలీసులు వెంటనే ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు అపస్మారక స్ధితిలో ఉన్నాడు. అతను కోలుకుంటే కానీ మిగతావివరాలు తెలియవని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు