Kodali Nani : ప్రజలు జగన్‌ను మరోసారి దీవిస్తారు, అందుకు ఇదే నిదర్శనం- కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో లబ్దిదారులు పెద్దఎత్తున ఉన్నారు.

Kodali Nani : ఏపీలో జగన్ ను మరోసారి ప్రజలు దీవిస్తారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున జరిగిన ఓటింగ్ ఇందుకు నిదర్శనం అన్నారాయన. ఈసారి మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారని.. వారంతా జగన్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నది తన అభిప్రాయం అన్నారు కొడాలి నాని.

”ఏపీలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత అందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. వాళ్ల భవిష్యత్తుని నిర్ణయించుకునే ఎన్నికల్లో వాళ్లు మంచి ప్రభుత్వానికి ఓటు వేస్తున్నారని నేను భావిస్తున్నా. గతం నుంచి కూడా చెబుతున్నాం. జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో లబ్దిదారులు పెద్దఎత్తున ఉన్నారు.

జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భావించారు. వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదలను పట్టించుకునే ప్రభుత్వం, ఇళ్లు నిర్మించి ఇచ్చిన ప్రభుత్వం.. జగన్ ను ఆశీర్వదించడానికి ఇంత పెద్దఎత్తున మహిళలు ఇంత ఎండలో కూడా బూత్ లకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్ ను మరోసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నా” అని కొడాలి నాని అన్నారు.

Also Read : ఓటరుని కొట్టిన తెనాలి ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్రహం.. స్పందించిన శివకుమార్