NTR 100 Rupees Coin : ఢిల్లీలో ఎన్టీఆర్ రూ.100 నాణేం విడుదల చేయనున్న రాష్ట్రపతి.. హాజరుకానున్న చంద్రబాబు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో..

NTR 100 Rupees Coin

Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో కూడిన రూ. 100 నాణేన్ని ఈనెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో హాజరుకావాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్రం సమాచారం అందించింది.

Nara Lokesh : నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా- నిప్పులు చెరిగిన నారా లోకేశ్

రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎన్టీఆర్ రూ.100 నాణేం ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ మేరకు ఆయన ఈనెల 27న ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 28న ఎన్టీఆర్ చిత్రంతో కూడిన రూ.100 నాణేం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న పలువురు సీనియర్ నేతలకు కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు సీఈసీని కలవనున్నారు. ఏపీలో దొంగ ఓట్లు, ఓట్ల తొలగింపు అక్రమాలపై చంద్రబాబు నాయుడు సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.

Chittoor : తల్లీబిడ్డల హత్య, బాలికపై అత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం, వైసీపీ అనుకూల ఓట్ల సమాచారం సేకరించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చంద్రబాబు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను సీఈసీకి చంద్రబాబు అందించనున్నట్లు సమాచారం. దీనికితోడు తెలుగుదేశం నేతలు అందించిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవట్లేదనికూడా సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు