సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయి: లావు శ్రీ కృష్ణ దేవరాయలు

రాష్ట్ర ఆర్థిక అంశాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తారని..

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పక్షనేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలు ముందుకు తీసుకువెళ్లే విషయంపై చర్చ జరిగిందని తెలిపారు. తమ వైపు నుంచి అన్ని సలహాలు ఇచ్చామని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక అంశాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తారని, సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయని లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. దాన్ని పార్లమెంట్ కూడా వివరిస్తామని అన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంట్లో వివరిస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు అడుగుతామనేది పార్లమెంట్ వేదికగా ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన విజయం సాధించిందని చెప్పారు. ఏపీ నుంచి 21 మంది ఎన్డీఏ ఎంపీలు ఉంటే అందులో 16 మంది టీడీపీ ఎంపీలు ఉన్నారని తెలిపారు. ఎంపీలు నియోజకవర్గం సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరామని చెప్పారు.

అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం పూర్తి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సిద్ధంగా లేమని సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో మాట్లాడుతామని అన్నారు. వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని చెప్పారు.

Also Read: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు