Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులను ప్రోత్సాహించడమే వారి ఉద్దేశమని కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kishan Reddy

Updated On : July 21, 2024 / 4:18 PM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ జయ గార్డెన్‌లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విసృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాద శక్తులు చాపకింద నీరులా ఎన్నికల్లో మోదీకి బీజేపీ వ్యతిరేకంగా అనేక కుతంత్రాలు చేశాయని అన్నారు.

దేశాన్ని చీల్చడం, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించడమే వారి ఉద్దేశమని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసింది కాంగ్రెసే కానీ తప్పుడు ప్రచారం చేసింది ఎంఐఎం అని చెప్పారు.

రానున్న పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. లోక్‌సభ జరగకుండా చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం గురించి అసత్యాలు ప్రచారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరించేందుకు సిద్ధమైందని అన్నారు.

Also Read: వైఎస్ జగన్‌కి సవాలు విసిరిన హోం మంత్రి వంగలపూడి అనిత