Vrischika Rasi Phalalu 2026 : వృశ్చిక రాశి వారికి ఆ 5 నెలలు మహర్జాతకం.. పట్టిందల్లా బంగారమే.. ఈ ఒక్క మార్పు చేసుకుంటే ఇక తిరుగే ఉండదు..!
Vrischika Rasi Phalalu 2026 : వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం రాజయోగం పడుతుందని.. 5 నెలల పాటు వారు పట్టిందల్లా బంగారమే అంటున్నారు పండితులు
Parabhava nama samvatsara ugadi panchangam 2026 Vrischika rasi phalalu Scorpio horoscope
Vrischika Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుందని.. ఈ సంవత్సరంలో వారు 5 నెలల పాటు పట్టిందల్లా బంగారమే అవుతుందని అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే వృశ్చిక రాశి వారిపై జూన్ వరకు అష్టమ గురువు ప్రభావం ఉండటం వల్ల ప్రయాణాలు చేయకపోవడమే మంచిదంటున్నారు. ఈ సమయంలో అప్పుల ఊబిలో చిక్కుకునే అవకాశం ఉందంటున్నారు. కనుక వృశ్చిక రాశి వారు జూన్ వరకు కూడా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఎవరి మీద ఆధారపడకుండా.. మిమ్మల్ని మీరు అంతర్మథనం చేసుకుంటే మీ శక్తి మీకు తెలుస్తుందని.. ఒంటరి ప్రయాణమే అద్భుతాలు సాధిస్తుందంటున్నారు పండితులు.
వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం: 11, వ్యయం: 5, రాజపూజ్యం: 2, అవమానం: 6 గా ఉండబోతుంది.
జూన్ నుండి అక్టోబర్ వరకు అదృష్ట సమయం:
వృశ్చిక రాశి వారికి జూన్ తర్వాత 5 నెలల పాటు అదృష్ట స్థానంలో గురువు సంచరించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉండేవారికి ఇది చాలా మంచి సమయం అంటున్నారు పండితులు.
పరిహారాలు – పూజలు:
- వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం పగడాల మాల, ప్రవాళ గణపతిని ధరించడం వల్ల విఘ్నాలు తొలగిపోయి మేలు జరుగుతుందంటున్నారు.
- అక్షయ తృతీయ నాడు శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకోవడం చాలా శ్రేయస్కరం అంటున్నారు పండితులు.
- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం, ఉడిపిలో శ్రీకృష్ణుడి రథోత్సవం చేయించడం వల్ల అద్భుత మార్పులు వస్తాయంటున్నారు.
దినచర్య:
ఖాళీగా కూర్చోకుండా ప్రతిరోజూ కనీసం 5000 అడుగులు నడవాలని, యోగా, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయని సూచించారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
