Tula Rasi Phalalu 2026 : తులా రాశి వారికి 6 నెలలు మాత్రమే అనుకూలం.. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే..!
Tula Rasi Phalalu 2026 : తులా రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని.. ఆరు నెలలు మాత్రమే అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
Parabhava nama samvatsara ugadi panchangam 2026 tula rasi phalalu libra horoscope
Tula Rasi Phalalu 2026 : పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆరు నెలలు మాత్రమే అనుకూల సమయం ఉందంటున్నారు పండితులు. తులా రాశి వారికి జూన్ నెల వరకు సమయం చాలా బాగుందని.. వివాహాది శుభకార్యాలు ఉంటే.. ఈ సమయంలోపే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సంవత్సరం డబ్బు ఉన్నా లేనట్టుగా ఉండాలని.. నెట్ బ్యాంకింగ్ వంటి వాటికి దూరంగా ఉంటే డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు.
తులా రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం-6, అవమానం-3 గా ఉంది.
జూన్ నుండి అక్టోబర్ వరకు (జాగ్రత్తలు)
జూన్ 3 నుండి అక్టోబర్ 31 వరకు గురువు 10వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో అనవసర పెట్టుబడులు పెట్టవద్దని, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అక్టోబర్ 31 తర్వాత మళ్లీ మంచి సమయం ప్రారంభమవుతుందని వెల్లడిస్తున్నారు.
అక్టోబర్ తర్వాత రాజయోగం
తులా రాశి వారికి అక్టోబర్ 31 నుండి జనవరి 24 వరకు గురువు ఏకాదశ స్థానంలోకి రావడం వల్ల 3 నెలల పాటు అద్భుతమైన రాజయోగం ఉంటుందని తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాదిలో ఆరు నెలల కాలం తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.
స్థాన మార్పు, పరిహారాలు
- పల్లెటూర్లలో ఉండి కలిసి రాని వారు జూన్-అక్టోబర్ మధ్యలో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు మారితే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
- తులా రాశి వారు “గురుగ్రహ అనుగ్రహ మాల” (పసుపు రంగు స్పటిక మాల) ధరించడం శ్రేయస్కరం.
- ధనత్రయోదశి నాడు కూడా మహాలక్ష్మి యాగం చేసుకోవడం వల్ల రాజయోగ సిద్ధి కలుగుతుందని చెప్పారు.
- తులా రాశి వారు అక్షయ తృతీయ నాడు మహాలక్ష్మి యాగం చేసుకోవడం మంచిదని తెలిపారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీన్ని 10tv.in నిర్ధారించడం లేదు.
