3 Monday Shiva Puja : 3 సోమవారాలు శివుడికి ఇలా చేశారంటే.. కష్టాలన్నీ తీరతాయి.. కనక వర్షం, రాజయోగం.. ఇక తిరుగుండదు
3 Monday Shiva Puja : జీవితంలో కష్టాలు తప్ప సంతోషం, సుఖం లేకుండా బాధపడేవారు 3 సోమవారాలు ఇలా శివుడిని పూజిస్తే.. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పండితులు.
powerful shiva remedy follow for 3 monday to solve all problems and bring rain of wealth
3 Monday Shiva Puja : మానవ జన్మ అంటేనే కష్టాలమయం. కష్టాలు, బాధలు, దుఃఖాలు లేకుండా సంతోషాలు, శాంతి లభించడం జరగదు. మన జీవితం అంటేనే కష్టసుఖాల సమ్మేళనం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కష్టాలను తొలగించడానికి కొన్ని పరిహారాలు చేస్తారు. మరీ ముఖ్యంగా వివాహం, ఆర్థిక, అనారోగ్య సమస్యలు వంటివి తొలగించాలంటే శివుడికి కొన్ని పరిహారాలు చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.. ఆర్థిక సమస్యలు తీరి కనక వర్షం కురవడమే కాక.. రాజయోగం కూడా దక్కుతుంది అంటున్నారు పండితులు. ఈ క్రమంలో మూడు సోమవారాలు పండితులు చెబుతున్న ఈ పరిహారాలు చేస్తే సమస్యల నుంచి బయటపడతారు.
ఈ పరిహారంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. వీటిని పాటించడానికి పెద్దగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పైగా దీనికి ఎలాంటి కఠిన నియమాలు పాటించే పని లేదు. అలానే ప్రత్యేక పూజా సామాగ్రి అవసరం లేదు. అలాగే ఈ పరిహారాలు పాటించడానికి కులమత భేదాలు కూడా లేవు. ఈ పరిహారాలు పాటిస్తే.. వివాహ ఆలస్యం, ఇంటి నిర్మాణంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, ఉద్యోగంలో ఆటంకాలు, విద్యలో ఒత్తిడి, ప్రయాణ అవరోధాలు, శత్రు బాధలు వంటి ఎన్నో కష్టాల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు, భక్తులు విశ్వసిస్తున్నారు.
ఈ పరిహారం మొత్తం “ఓం నమః శివాయ” మంత్రశక్తిపై ఆధారపడి ఉంటుంది. మూడు సోమవారాలు ఈ పరిహారం పాటిస్తే.. మీ జీవితం, ఇంట్లో నెలకొన్న సమస్యలు తీరిపోతాయి.. పురుషులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు ఎవరైనా దీన్ని పాటించవచ్చు. ఈ పరిహారాలు పాటించడానికి కఠిన ఉపవాసాలు అవసరం లేదంటున్నారు పండితులు.
పరిహారం చేసే విధానం:
- వరుసగా మూడు సోమవారాలు ఈ పరిహారం పాటించాలి.
- ప్రతి సోమవారం సాయంత్రం 6:05 గంటల నుంచి రాత్రి 8:30 గంటల మధ్య ఈ పరిహారం పాటించాలి.
- పూజ చేయడానికి ముందుగా శుభ్రంగా స్నానం చేయాలి. వీలు కాకపోతే కనీసం చేతులు, కాళ్లు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.
- తర్వాత సుమారు 2 అంగుళాల పరిమాణంలో ఉన్న చిన్న శివలింగాన్ని తీసుకోవాలి.
- అది స్ఫటిక లింగం అయినా, మట్టితో చేసిన లింగం అయినా సరే.
- స్వయంగా తయారు చేసిన మట్టి శివలింగానికి పూజ చేస్తే మరింత శుభప్రదమని చెబుతారు.
- తూర్పు దిశగా ముఖం చేసి కూర్చోవాలి.
- అనంతరం విభూతితో శివలింగానికి భస్మాభిషేకం చేయాలి.
- భస్మాన్ని సమర్పించే సమయంలో నిరంతరం “ఓం నమః శివాయ” మంత్రాన్ని జపించాలి.
ఈ మూడు సోమవారాల పాటు మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇలా చేస్తే మరింత శుభఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. విశ్వాసంతో ఈ పరిహారం పాటిస్తే.. మొదటి సోమవారం నుంచే సానుకూల మార్పులు కనిపిస్తాయని, రెండో సోమవారం నాటికి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని, మూడో సోమవారం నాటికి కఠినమైన అవరోధాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఈ శివ పరిహారంలో ముఖ్యంగా అవసరమయ్యే మూడు ప్రధాన వస్తువులు ఏంటంటే.. “ఓం నమః శివాయ” మంత్రం, విభూతి, చిన్న శివలింగం. భక్తితో, నమ్మకంతో ఈ పరిహారాలను పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
