Matheesha Pathirana: 18 కోట్లు పెట్టి కొంటే.. వేసింది 8 బంతులే.. ఒక్కో బంతికి 2.5 కోట్లు.. కేకేఆర్‌కు అత్యంత ఖరీదైన గాయం..
ఈ సీజన్లో మతీశ పతిరణ తన బౌలింగ్‌తో తమకు బాగా ఉపయోగపడతాడని భావించి కేకేఆర్‌కు చివరికి నిరాశే మిగిలింది. ఇంజ్యూరీ కారణంగా అతడు సీజన్ మొత్తం దూరమయ్యాడు.
Matheesha Pathirana: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 కోట్లకు ఆ బౌలర్ ను కొనుగోలు చేశారు. నిప్పులు చెరిగే బంతులు వేసే బౌలర్ ను కొనేశాం.. ఇక ఐపీఎల్ 2026 సీజన్ లో తమకు తిరుగు ఉండదని భావించారు. ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తామని ఆశించారు. అన్ని మ్యాచుల్లో విజయం తమదే ధీమా వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. 18 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. 18 కోట్లు పెట్టి కొంటే.. ఈ సీజన్ మొత్తంలో ఆ నిప్పులు చెరిగే బంతులు వేసే బౌలర్ వేసింది కేవలం 8 బంతులే. అంటే ఒక్కో బంతికి 2.5 కోట్లు చెల్లించినట్లు.
ఐపీఎల్ 2026లో ఇదీ కోల్ కతా నైట్ రైడర్స్ దుస్థితి. ఐపీఎల్ 2026లో కేకేఆర్‌కు ఇది అత్యంత ఖరీదైన గాయం, అంతకు మంచి గుండెకోత. 18 కోట్లు పెట్టి మరీ ఆ జట్టు యాజమాన్య కొనుగోలు చేసిన బౌలర్ మతీశ పతిరణ. ఇతడు శ్రీలంక క్రికెటర్. ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన పతిరణను రూ. 18 కోట్లు పెట్టి కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే కేకేర్ కు బిగ్ షాక్ ఇచ్చాడు పతిరణ. ఐపీఎల్ ప్రారంభానికి ముందే కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న పతిరణ సీజన్లో కేకేఆర్ ఆడిన 12 మ్యాచులకు దూరంగా ఉన్నాడు.
గాయం నుంచి కోలుకున్న పతిరణ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. వచ్చీ రావడంతోనే తన ప్రతాపం చూపిస్తాడని అంతా భావించారు. కానీ 8 బంతులు వేశాక కాలి పిక్క కండరాలు పట్టేయడంతో గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు పతిరణ. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఏకంగా స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
మతీశ పతిరణ ఈ సీజన్లో తన బౌలింగ్‌తో తమకు బాగా ఉపయోగపడతాడని భావించి కేకేఆర్‌కు చివరికి నిరాశే మిగిలింది. ఇంజ్యూరీ కారణంగా అతడు సీజన్ మొత్తం దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్క మ్యాచ్ ఆడినా ఆటగాడికి మొత్తం పారితోషికం చెల్లించాల్సిందే. ఈ లెక్కన పతిరణ సీజన్లో ఒక్క మ్యాచ్‌లోనే ఆడినప్పటికీ 8 బంతులు మాత్రమే వేసినప్పటికీ అతనికి 18 కోట్లు దక్కనున్నాయి.
Also Read: లక్నో తరుపున అర్జున్ టెండూల్కర్ అరంగ్రేటం.. తండ్రి సచిన్ అలా.. అక్క సారా ఇలా..
