Arjun Tendulkar : లక్నో తరుపున అర్జున్ టెండూల్కర్ అరంగ్రేటం.. తండ్రి సచిన్ అలా.. అక్క సారా ఇలా..
ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar ) నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున అరంగ్రేటం చేశాడు
IPL 2026 Sachin and sara Tendulkar reacts to Arjun performance in LSG vs PBKS match
- లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఐపీఎల్లో అర్జున్ టెండూల్కర్ అరంగ్రేటం
- పంజాబ్ కింగ్స్ పై అద్భుత ప్రదర్శన
- సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు
Arjun Tendulkar : ఎట్టకేలకు అర్జున్ టెండూల్కర్ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరుపున అరంగ్రేటం చేశాడు. శనివారం ఎకానా స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ తొలుత ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 5 బంతుల్లో 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తరువాత తన 4 ఓవర్ల కోటా బౌలింగ్‌లో 36 పరుగులు మాత్రమే ఇచ్చి దూకుడుగా ఆడుతున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్ వికెట్ పడగొట్టాడు. ఎకానమీ 9 మాత్రమే. ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లలో అర్జున్ ది మాత్రమే అతి తక్కువ ఎకానమీ. మిగిలిన బౌలర్ల అందరి ఎకానమీ కూడా 10కి పైనే ఉండడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోయినప్పటికి కూడా అర్జున్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాచ్‌లోని అర్జున్ ఫోటోను పోస్టు చేస్తూ సోషల్ మీడియా వేదికగా అతడి తండ్రి సచిన్ టెండూల్కర్, అక్క సారా టెండూల్కర్ అతడిని ప్రశంసించారు.
‘చాలా బాగా ఆడావు అర్జున్. ఈ సీజన్ మొత్తంలో నువ్వు ప్రవర్తించిన తీరుపట్ల నాకు గర్వంగా ఉంది. ఎల్లప్పుడూ నీ సామర్థ్యాన్ని నమ్ముతూ, ఓపికగా ఉంటూ, నిశ్శబ్దంగా కష్టపడుతూ, చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చినా సానుకూలంగా ఉన్నావు. క్రికెట్ నైపుణ్యంతో పాటు ఓపికను కూడా పరీక్షిస్తుంది. ఈరోజు నువ్వు ఆ రెండింటినీ అద్భుతంగా నిర్వహించావు. నిజాయితీగా ఉండు, ఎప్పటిలాగే ఈ ఆటను ప్రేమిస్తూనే ఉండు. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాను. ‘అంటూ సచిన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
Well done, Arjun. ❤️
Proud of the way you’ve carried yourself through this season, always believing in your ability, staying patient, working hard quietly, and remaining positive despite having to wait for your opportunity till the very last match.
Cricket tests patience as much… pic.twitter.com/3RdiGkXbfT— Sachin Tendulkar (@sachin_rt) May 23, 2026
‘నువ్వు ఈ ప్రపంచంలోని అన్ని సంతోషాలకు అర్హుడివి నా తమ్ముడా! నీ కష్టపడే తత్వం, ఒత్తిడిని అధిగమించే నీ నైపుణ్యం, ఈ సుదీర్ఘ ప్రయాణంలో నువ్వు చూపించిన ఓపికను చూస్తే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.’ అని సారా రాసుకొచ్చింది.
View this post on Instagram
ఈ సీజన్‌కు ముందు వరకు అర్జున్ టెండూల్కర్ ముంబైకి ఆడాడు. మూడు సీజన్ల పాటు ఉన్నప్పటికి అతడికి అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. 5 మ్యాచ్‌లు ఆడగా మూడు వికెట్లు తీశాడు. ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాగా 13 పరుగులు సాధించాడు. 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు లక్నో జట్టు ట్రేడింగ్‌లో 30లక్షలకు అర్జున్ను ముంబై నుంచి తీసుకుంది. అయితే.. లక్నో కూడా అర్జున్‌కు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వగా అర్జున్ తనని తాను నిరూపించుకున్నాడు.
