IPL 2026: కోల్ కతాపై ఢిల్లీ విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 204 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్..
IPL 2026: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 40 పరుగుల తేడాతో కేకేఆర్ ని చిత్తు చేసింది డీసీ. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 204 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్.. 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రహానె హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 39 బంతుల్లో 63 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో కేకేఆర్ కు ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఎంగిడి తలో 3 వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.
