Sun in Rohini Nakshatra 2026 : రోహిణి నక్షత్రంలో సూర్యుడు.. ఈ రాశుల వారికి అఖండ ధన యోగం.. మీ జీవితం వెలిగిపోతుంది..!
Sun in Rohini Nakshatra 2026 : సూర్యడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని వల్ల పలు రాశులకి అదృష్టం పట్టనుంది.
sun in rohini nakshatra these zodiac signs get unstoppable luck and wealth
Sun in Rohini Nakshatra 2026 : రోహిణి కార్తె అంటే చాలు… జనాలు భయపడిపోతారు. కారణం ఈ సమయంలో రోళ్లు పగిలేంత తీవ్రమైన ఎండలు కాస్తాయని అంటారు. అయితే ఈ ఏడాది మాత్రం వీటన్నింటికి భిన్నంగా మార్చి నెల ప్రారంభం నుంచే రోళ్లు పగిలే ఎండ కాస్తుంది. ఇక మే నెలలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వాతావరణం సంగతి కాసేపు పక్కకు పెడితే.. రోహిణి కార్తె అంటే.. సూర్యుడు.. రోహిణి నక్షత్రంలోకి అడుగు పెడతాడు. జూన్ 8, మృగశిర కార్తె వరకు అక్కడే ఉంటాడు. వాతావరణం పరంగా మాత్రమే కాకుండా జ్యోతిష్యశాస్త్రపరంగా కూడా ఈ సమయం చాలా కీలకమైంది అంటున్నారు పండితులు. సూర్యుడు నక్షత్రం మారినప్పుడు అది ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అనుకోని ప్రయోజనాలు కలుగుతాయి. అలానే ఇప్పుడు సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉండటం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది శుభాలను తీసుకొస్తుంది.
మేష రాశి :
- సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందే రాశుల్లో మేష రాశి ఉంది.
- వీరు మొదలు పెట్టిన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు.
- ఆదాయం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా మారతాయి.
- అత్తమామల నుంచి రావాల్సిన వారసత్వ ఆస్తి దక్కుతుంది.
- ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు.
వృషభ రాశి :
- సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉండటం వల్ల మేలు కలిగే రాశుల్లో వృషభ రాశి కూడా ఉంది.
- ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.
- ఈ రాశి వారు త్వరలోనే నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
- ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది.
- అలానే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం.
సింహ రాశి :
- సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల సింహ రాశి వారికి కూడా అద్భుతంగా కలిసి వస్తుంది.
- ఈ రాశి వారి ఆదాయం రెట్టింపు అవుతుంది.
- చాలా రోజులుగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి ఇది మంచి సమయం.
- అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా ఉండనున్నది.
కుంభ రాశి :
- కుంభ రాశి వారికి సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారం వలన ఊహించని ధన లాభం కలుగుతుంది.
- పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
- ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.. డబ్బు పొదుపు చేస్తారు.
- రోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
