Venkata Satish : మొదటి రోజు నెగిటివ్ టాక్.. రిలీజ్‌కి ఇబ్బందులు.. పవన్ కళ్యాణ్ నీ వెనకాల ఉన్నాను అని.. పెద్ది నిర్మాత కామెంట్స్ వైరల్..
ఈ ఈవెంట్లో పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. (Venkata Satish)
venkata satish kilaru
Venkata Satish : ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాతో వచ్చి పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 420 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇన్ స్పైరింగ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగిడారు. తన నటనతో అందర్నీ మెప్పించి ఎమోషనల్ చేసారు చరణ్.
పెద్ది సినిమా భారీ విజయం సాధించినందుకు నేడు హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మెగా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.
Also Read : Chiranjeevi : అవార్డులు రావడానికి చాలా దార్లు ఉంటాయి.. కానీ.. చరణ్ గురించి మాట్లాడుతూ చిరు ఎమోషనల్..
ఈ ఈవెంట్లో పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ఈ సినిమాకు మొదటి రోజు కొంత నెగిటివ్ టాక్ వచ్చినా తెలుగు ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాని భుజాలకెత్తుకొని నడిపించారు. ప్రేక్షకులకు నచ్చింది ఈ సినిమా. సినిమా కలెక్షన్స్ విషయంలో మా డిస్ట్రిబ్యూటర్లు ఆనందంలో ఉన్నారు. సక్సెస్ అయి బ్రేక్ ఈవెన్ అయి లాభాలు వచ్చాయి. సింగిల్ స్క్రీన్స్, బిసి సెంటర్స్ ఇరగ్గొట్టేసింది సినిమా. ఎగ్జిబిటర్లు హ్యాపీ.
ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. రిలీజ్ కి ముందు ఆ ఇబ్బందుల్లో నాకు సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు నీ వెనకాల ఉన్నాను నువ్వు సినిమా రిలీజ్ చేయి అని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేసాయి అని అన్నారు. అనంతరం సినిమా గురించి, సినిమాకు పనిచేసిన వారి గురించి మాట్లాడారు నిర్మాత.
