Rahu Ketu Conjunction 2026 : త్వరలోనే దుష్టగ్రహాల అరుదైన కలయిక.. కానీ ఈ రాశుల వారికి మహర్జాతకం.. ఆర్థిక సమస్యలన్నీ పరార్..!
Rahu Ketu Conjunction 2026 : అతి త్వరలోనే రెండు దుష్టగ్రహాల అరుదైన కలయిక జరగబోతుంది. దీని వల్ల కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలు చవి చూడనున్నారు.
Rahu Ketu Conjunction 2026 huge financial benefits for these zodiac signs
Rahu Ketu Conjunction 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు, రాశులు నిత్యం వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. అలానే కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే రాశి లేదా నక్షత్రంలో కలుసుకుంటాయి. ఇలాంటి కలయికలు కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇస్తే.. మరికొన్నిసార్లు ప్రతికూల ఫలితాలను చూపుతాయి. అయితే ఇలాంటి గ్రహాలు, రాశుల కలయిక వల్ల కలిగే ప్రభావాలు మంచివైనా.. చెడువైనా సరే వాటి ప్రభావం మొత్తం 12 రాశుల మీద ఉంటుంది. ఈ క్రమంలో త్వరలోనే రెండు దుష్టగ్రహాల అరుదైన కలయిక జరగబోతోందని.. దీనివల్ల రెండు రాశుల వారికి మాత్రం బీభత్సంగా కలిసి వస్తుందని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.
రాహు, కేతువుల అరుదైన కలయిక
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాహు, కేతువులు రెండూ కూడా ఛాయా గ్రహాలు లేదా దుష్టగ్రహాలే. ఇవి కొన్ని సందర్భాల్లో వాటి స్థానాన్ని మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల మీద మంచి ప్రభావాన్నే చూపుతాయి. ఈ క్రమంలోనే త్వరలోనే జరగబోయే రాహు, కేతువుల అరుదైన కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత జీవితంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ రెండు దుష్టగ్రహాల కలయిక వల్ల ఇప్పుడు చెప్పబోయే రాశుల వారికి విపరీతంగా కలిసి రానుంది. ఇంతకీ ఆ రెండు రాశులు ఏవంటే…
మేష రాశి
రాహు, కేతు గ్రహాల అరుదైన కలయిక వల్ల విపరీతంగా కలిసి వచ్చే రాశి మేష రాశి. ఈ దుష్టగ్రహాల కలయిక వల్ల మేష రాశి వ్యాపారస్తులు భారీగా లాభాలను చవిచూస్తారు. ఇన్నాళ్ల నుంచి వేధిస్తున్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. అలానే ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి చాలా బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న ప్రతి పనినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. అలానే దంపతుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఒక గొప్ప వ్యక్తి సహాయం వల్ల మేష రాశి వారి జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి
దుష్టగ్రహాలైన రాహు, కేతువుల కలయిక వల్ల బాగా కలిసి వచ్చే మరో రాశి సింహ రాశి. ఈ గ్రహాల కలయిక వల్ల వీరి జీవితంలో భారీగా మార్పులు రాబోతున్నాయి. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మీకు మంచి మద్దతు, సహాయం అందుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్తలను ఇప్పుడు వింటారు. రాహు, కేతువుల కలయిక వల్ల సింహ రాశి వారు మహర్జాతుకులు కాబోతున్నారని పండితులు అంచనా వేస్తున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
