Andhra Pradesh : కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దు – సీఎం జగన్

కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దని, అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.

CM Jagan: డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉండడం సంచలనం సృష్టించింది. దీనిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దని, అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో పర్యవేక్షణ ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ ఉదంతాలు ఉన్నాయా ? లేదా ? అనే దానిపై సమీక్షించాలన్నారు.

Read More : cheddi gang : తిరుపతి నగరంలో చెడ్డీగ్యాంగ్ కలకలం..అప్రమత్తమైన పోలీసులు

డ్రగ్స్ ఉదంతాలున్న కాలేజీలను మ్యాపింగ్ చేయడం, డ్రగ్స్ ఎవరు పంపిణీ చేస్తున్నారు ? ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్ నిరోధాన్ని సవాలుగా తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి ప్రగతి నివేదికలు ఇవ్వాలన్నారు.

Read More : Tiger In Tirumala : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి సంచారం

ఏపీకి సంబంధం లేని డ్రగ్స్ వ్యవహారంపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని అంశాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని, వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వంతో పాటు వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారని..ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని నేతలు, అధికారులకు సూచించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారిని ప్రోత్సాహించాలన్న ఆయన..సైబర్ క్రైమ్ నిరోధకంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు