Dancer Suspicious Death : తమిళనాడులో తిరుపతికి చెందిన మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి

ఓ వివాహ వేడుకలో నృత్యం చేయడం కోసం హిమబిందు అనే డ్యాన్సర్ ఇద్దరు యువకులతో సహా 10 మంది డ్యాన్సర్ లతో కలిసి ఈ నెల (సెప్టెంబర్) 11న యాలగిరికి వెళ్ళారు. ఈ క్రమంలో తాను బస చేసిన రిసార్ట్స్ లోని గదిలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని హిమబిందు మరణించారు.

Female dancer suspicious death

Female Dancer Suspicious Death : తమిళనాడులో తిరుపతికి చెందిన మహిళా డ్యాన్సర్ అనుమానాస్పద మృతి చెందారు. ఈ ఘటన యాలగిరి హిల్ స్టేషన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహ వేడుకలో నృత్యం చేయడం కోసం హిమబిందు అనే డ్యాన్సర్ ఇద్దరు యువకులతో సహా 10 మంది డ్యాన్సర్ లతో కలిసి ఈ నెల (సెప్టెంబర్) 11న యాలగిరికి వెళ్ళారు.

ఈ క్రమంలో తాను బస చేసిన రిసార్ట్స్ లోని గదిలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని హిమబిందు మరణించారు. మృతురాలి ముఖంపై రక్తపు గాయాలు ఉన్నాయి. దీంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Suspicious Death : నందివాడ ఎస్సై శిరీష భర్త అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం

పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వానియంబాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు