Kodali Nani: చంద్రబాబు అన్ని రూ.కోట్లు ఇలా సంపాదించారు: కొడాలి నాని

అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలో ఆ డబ్బు మొత్తాన్ని విపరీతంగా పెంచుకుంటూ వస్తున్నారని అన్నారు.

Kodali Nani - Chandrababu Naidu

Kodali Nani – Machilipatnam: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఐటీ నుంచి నోటీసులు అందడంపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. కృష్ణా జిల్లా (Krishna district) మచిలీపట్నంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సమయంలో డబ్బులు పంచడాన్ని చంద్రబాబు నాయుడే అందరికీ నేర్పించారని కొడాలి నాని అన్నారు. 1999లో టీడీపీలోకి ప్రతి అభ్యర్థికి రూ.కోటి చొప్పున ఇచ్చారని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలో ఆ డబ్బు మొత్తాన్ని విపరీతంగా పెంచుకుంటూ వస్తున్నారని అన్నారు. ఈ డబ్బంతా చంద్రబాబుకు ఎలా వచ్చిందని నిలదీశారు.

కమీషన్లు తీసుకున్నారు కాబట్టే వచ్చిందని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు రూ.118 కోట్ల విషయంలో మాత్రమే ఐటీ నోటీసులు అందాయని, ఆ డబ్బు మొత్తం చాలా తక్కువ అని చెప్పారు. ఇది దొరికిన డబ్బు మాత్రమేనని అన్నారు. చంద్రబాబు దాదాపు రూ.లక్ష కోట్ల వరకు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ ద్వారా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వస్తాయని నిలదీశారు. చంద్రబాబు అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు.

Gone Prakash Rao : జమిలి ఎన్నికలు సాధ్యం కాదు.. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు : గోనె ప్రకాష్ రావు

ట్రెండింగ్ వార్తలు