Pawan kalyan : జనసేన ’వారాహి’ వాహనం రంగుపై వైసీపీ విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్

జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం వాహనంపై వైసీపీ చేసిన విమర్శలపై జనసేనాని కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లో షర్టును పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

Pawan kalyan : AP అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం కోసం వాహనం సిద్ధమైంది. దానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆ వాహనానికి సంబంధించిన వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ పవన్ కల్యాణ్ పేరు చెబితేనే విమర్శలు సంధిస్తుంటుంది. ఈక్రమంలో మరోసారి తమకో పాయింట్ దొరికింది అన్నట్లుగా పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు సంధించింది.

దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ ఈ విషయంపై స్పందించారు. ముందు ఏపీలో నా సినిమాలను ఆపేశారు. విశాఖలో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. జనసేన కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారు. నన్ను హోటల్ గది నుంచి బయటకు రాకుండా చేశారు. విశాఖ వదిలి వెళ్లమని పోలీసులతో బలవంత పెట్టించారు. మంగళగిరిలో నా కారు బయటకు రానివ్వలేదు. ఇప్పుడు నా వాహనం ‘వారాహి’రంగు సమస్య అంటున్నారు. అంటే నేను ఊపిరి పీల్చుకోవటం కూడా ఆపేయాలా? మరి ఇంక ఆ తరువాత ఏంటి..వాట్ నెక్ట్స్? అంటూ ప్రశ్నించారు ట్విట్టర్ వేదికగా జనసేనాని. అంతేకాదు మరో ట్వీట్ లో పవన్ ‘వారాహి’వాహనం కలర్ షర్టును పోస్టు చేస్తు ఈ షర్టు వేసుకోవటానికి అనుమతి ఉందా? అంటూ వైసీపీపై సెటైర్ వేశారు.

కాగా..ఇప్పటికే వారాహి వాహనంపై వచ్చిన విమర్శలపై జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ..గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వైఎస్సార్‌సీపీ.. జనసేన పార్టీ వారాహి వాహనం రంగుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంి అంటూ ఎద్దేవా చేశారు. ఏ రంగు వేశారో చూడకుండా రవాణాశాఖ ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారమే వారాహి వాహనానికి రంగులు ఉన్నాయని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్. హైకోర్టుతో లెక్కకు మించి మొట్టికాయలు వేయించుకున్న వారు కూడా నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరం అంటూ ఎద్దేవా చేశారు. వారాహి వాహనం రంగులపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ల మూర్ఖత్వాన్ని నిదర్శనమని అన్నారు.

Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధం: పవన్ కల్యాణ్

కాగా..ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీలో సెగలు పుట్టిస్తోంది. పవన్ ఎక్కడికి వెళితే అక్కడ ఆటకాలు సృష్టిస్తోంది. పవన్ ప్రయాణించే వాహనాలను ఆపేయటమేకాదు. పవన్ రోడ్డు వెంట నడుస్తున్నా పోలీసులు ఆపేస్తున్నారు. ప్రజల సమస్యల గురించి విచారించటానికి కష్టాల్లో ఉన్నవారికి భరోసా కల్పించటానికి వెళ్లినా ఎక్కడిక్కడ ఆటంకాలు సృష్టించటమే పనిగా పెట్టుకుంది వైసీపీ అంటూ జనసేన విమర్శిస్తోంది. ఇవి కేవలం విమర్శలు కాదని పవన్ సినిమాలు ఆపేయటం..విశాఖ టూర్ లో పోలీసులు చేసిన రాద్దాంతం..అలాగే జనసేన కార్యకర్తలపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టటం వంటి పలు అంశాలు జనసేనపై వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న కక్ష సాధింపే అంటున్నారు జనసేన కార్యకర్తలు.

ఈక్రమంలో జనసేనాని ఎన్నికల ప్రచారం రథం వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దుకొంటోందని.. పవన్‌ కళ్యాణ్‌ నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటారు అని నాదెండ్ల తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం ప్రజల డబ్బుతో వైఎస్సార్‌సీపీ పార్టీ రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి? న్నారు. ఆ పార్టీ నాయకుల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం అంటూ ఎద్దేవా చేశారు..పాలనలోకి వచ్చిఏపీ ప్రజలను ముప్పు తిప్పలు పెట్టటం తప్ప పాలన చేతకాని వైసీపీ నేతలతో చెప్పించుకునేలా జనసేన ఎప్పుడూ వ్యవహరించదని..బూతులు మాట్లాడటం పాలన గురించి ఏమాత్రం అవగాహనలేని వైసీపీ నేతలు ఇంతకంటే ఏం మాట్లాడతారు? అంటూ ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు