TDP : క్షమాపణలు చెప్పడానికి ఇంత సమయం పట్టిందా ?

మంత్రి కొడాలి నాని ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి పాదయాత్రలో రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని...

Anitha Vangalapudi : ఒక విషయం మీద రియలైజ్ కావడానికి ఇంత సమయం పట్టిందా ? విషయం ఇక్కడితో వదిలేయాలని అంటున్నారు…ఎలా వదిలేయాలి ? అని ప్రశ్నించారు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దీనిపై విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. దీనిపై వంగలపూడి అనిత రియాక్ట్ అయ్యారు. 2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు.

Read More : Rare coin Rs 2.6 crore : రూ.2.6 కోట్లు పలికిన 16వ శతాబ్దం నాటి నాణెం..

తాము క్షమాపణ అని అనుకోవడం లేదని, 95 శాతం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని అంటున్నారని తెలిపారు. ఎలాంటి క్షమాపణ అనేది ఆలోచించుకోవాలని వల్లభనేని వంశీకి సూచించారు. మంత్రి కొడాలి నాని ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి పాదయాత్రలో రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని, వంట, భోజనం చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. దీంతో ఆందోళన చేపడుతున్న వారు…నడిరోడ్డుపై కూర్చొని భోజనం చేశారన్నారు. మహిళలకు బయో టాయిలెట్స్ లేకుండా తొలగించారని, పొదుపు సంఘాల్లో దాచుకున్న డబ్బులను తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఓటీఎస్ కొంద కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం ఏంటీ ? అని ఆమె ప్రశ్నించారు. దిశ చట్టం కింద నలుగురికి ఉరి శిక్ష వేశామని హోం మంత్రి అమాయకంగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు వంగలపూడి అనిత.

ట్రెండింగ్ వార్తలు