Tomato Price : దిగొచ్చిన టమాట ధర.. కిలో రూ.20

కిలో వంద రూపాయల వరకు అమ్ముడుపోయిన టమాటా ధర దిగొస్తుంది. ఒక్కసారిగా భారీగా పతనమైంది. చిత్తూరు జిల్లాలోని ములకల చెరువు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కిలో కేవలం 20 రూపాయల ధర పలికింది.

Tomato price reduced : కిలో వంద రూపాయల వరకు అమ్ముడుపోయిన టమాటా ధర దిగొస్తుంది. టమాటా ఒక్కసారిగా భారీగా పతనమైంది. చిత్తూరు జిల్లాలోని ములకల చెరువు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కిలో కేవలం 20 రూపాయల ధర పలికింది. 30 కిలోల టమాట బాక్స్‌ కేవలం 600 రూపాయలకు అమ్ముడుపోయింది. రెండు రోజుల క్రితం వరకు 30 కిలోల టమాట బాక్స్ ఏకంగా 3 వేల రూపాయలు పలికింది. ఇతర రాష్ట్రాల నుంచి పలువురు వ్యాపారులు ములకల చెరువు మార్కెట్‌కు టమాటాలను తీసుకురావడంతో భారీగా ధర తగ్గింది.

చిత్తూరు జిల్లాలో టమాటా మార్కెట్‌కు ప్రఖ్యాతిచెందిన మదనపల్లిలోనూ ధర పడిపోయింది. మొదటి రకం టమాటా కిలో 50 రూపాయలు పలికింది. శని, ఆదివారాలు చెన్నై వ్యాపారులు మదనపల్లి మార్కెట్‌కు రారని దీంతో ధర పతనమైందని ఓ వాదన ఉంది. సోమవారం మళ్లీ టమాట ధర పెరగొచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మదనపల్లి మార్కెట్‌లో మూడు రోజుల క్రితం కిలో టమాటా ఏకంగా 140 రూపాయలకు అమ్ముడుపోయింది.

Massive Fraud : అధిక వడ్డీల పేరుతో రూ.200 కోట్లు మోసం..బాధితుల్లో టాలీవుడ్ ప్రముఖులు

కర్నూలు జిల్లాలోనూ టమాట ధర భారీగా తగ్గింది. కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ప్యాపిలి మార్కెట్లలో టమటా గణనీయంగా పడిపోయింది. నిన్న మొన్నటివరకు కిలో 100 నుంచి 130 రూపాయలకు అమ్ముడుపోయిన టమాటా.. ప్రస్తుతం 30 నుంచి 40 రూపాయలకు అమ్ముడుపోతోంది.

దేశవ్యాప్తంగానూ టమాటా ధర తగ్గిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో 35 నుంచి 40 రూపాయలకు అమ్ముడుపోతోంది. వంద రూపాయలకు అమ్ముడుపోయిన కిలో టమాటా ఇప్పుడు 20 నుంచి 50 రూపాయలకే కొంటున్న వినియోగదారులు మరింతగా తగ్గుతుందని ఆశిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు