డీజిల్‌తో పరాఠా తయారు చేసిన దాబా నిర్వాహకులు.. వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియోను నెబులా పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Chandigarh dhaba

భారత్‌లో పరాఠాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఓ ప్రధానమైన ఆహార పదార్థం ఇది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, ఒక్కోసారి డిన్నర్ లోనూ పరాఠాలే తీసుకుంటారు చాలా మంది. పరాఠాలు తయారు చేయడానికి సులభంగా ఉంటాయి.. ఎంతో రుచిగా ఉంటాయి.

నెయ్యి, వెన్నను వాడుతూ దీన్ని చేస్తారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని ఓ దాబాలో మాత్రం డీజిల్ తో పరాఠాలను చేసి అందరినీ షాక్ కు గురి చేశారు నిర్వాహకులు. ఇందుకు సంబంధించిన వీడియోను నెబులా పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పరాఠాను ఎలా తయారు చేశారో ఇందులో చూపారు.

ఆ వీడియోలో ఉన్న ఒక వ్యక్తి.. బబ్లూ అనే కుక్ ని ఏమి చేస్తున్నావని అడిగాడు. దానికి బబ్లు సమాధానం చెబుూ డీజిల్ పరాఠా చేస్తున్నానని చెప్పాడు. కుక్ బబ్లూ ముందుగా పిండిని రోల్ చేశాడు. ఆ తర్వాత అందులో ఆలుగడ్డ మిక్స్‌ చేశాడు. పాన్ లో కాల్చి, పరాఠాపై అధిక మోతాదులో నూనెను పోశాడు. అది డీజిల్ అని అన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారు.

దీనిపై స్పందించిన ఓ యూజర్ కామెంట్ చేస్తూ.. ఆ వంటవాడు త్వరలోనే ఫెరారీని కొంటాడని, అతడి కస్టమర్లు క్యాన్సర్ చికిత్స కోసం వారి ఇళ్లు, కార్లను అమ్మేస్తారని సెటైర్ వేశాడు. అది నిజంగా డీజిల్ అయివుండదని, అయినప్పటికీ అంత నూనె పోయడం ఆరోగ్యానికి మంచిది కాదని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఈ వీడియో నిజమైతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : వేసవి దుక్కులతో రైతులకు ఎన్నో లాభాలు – చీడపీడల నివారణ, పెరగనున్న భూసారం   

ట్రెండింగ్ వార్తలు