మూడో భార్య చేతిలో భర్త హత్య.. బావిలో మృతదేహం.. రెండో భార్య గుర్తించి..

మున్నితో అతడికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, మున్ని స్థానిక వ్యక్తి నారాయణ్ దాస్ కుష్వాహా (లల్లు)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

మూడో భార్య చేతిలో భర్త హత్య.. బావిలో మృతదేహం.. రెండో భార్య గుర్తించి..

Representative image

Updated On : September 7, 2025 / 8:05 PM IST

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి తన మూడో భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. అనుప్పూర్ జిల్లా సకారియా గ్రామంలో భయ్యాలాల్ రాజక్ (60) మృతదేహం బావిలో కనపడడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతడిని చంపింది మూడో భార్యేనని గుర్తించారు.

భయ్యాలాల్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. రెండో భార్య పేరు గుడ్డీభాయి. ఆమెకు పిల్లలు లేరు. దీంతో పిల్లలు కావాలంటూ భయ్యాలాల్ గుడ్డీచెల్లెలు మున్ని (విమల)ని పెళ్లి చేసుకున్నాడు.

మున్నితో అతడికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, మున్ని స్థానిక వ్యక్తి నారాయణ్ దాస్ కుష్వాహా (లల్లు)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. (Madhya Pradesh)

Also Read: స్క్రీన్‌పై కనపడకుండానే 3 పదాల డైలాగ్‌ మాత్రమే చెప్పి రూ.132 కోట్లు సంపాదించిన నటుడు

భయ్యాలాల్ రాజక్‌కు చంపేస్తే తాము హ్యాపీగా ఉండొచ్చని మున్ని, లల్లు భావించారు. లల్లు ధీరజ్ కోల్ అనే యువకుడితో కలిసి ఆగస్టు 30 రాత్రి భయ్యాలాల్ వద్దకు వెళ్లాడు. భయ్యాలాల్ మంచం మీద నిద్రిస్తున్న సమయంలో లల్లు, ధీరజ్ ఇనుప రాడ్ తో దాడి చేశారు. ఆ తర్వాత భయ్యలాల్ మృతదేహాన్ని బస్తా, దుప్పట్లో కట్టి, తాళ్లూ చీరలతో చుట్టి గ్రామంలోని బావిలో పడేశారు.

మరుసటిరోజు ఉదయం భయ్యాలాల్ రెండో భార్య గుడ్డీభాయి బావి వద్దకు వెళ్లడంతో ఆమెకు అందులో తన భర్త శవం ఉన్నట్లు కనపడింది. పోలీసులు సమాచారం అందుకుని అక్కడకు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు.

“భయ్యాలాల్ మూడో భార్య మున్ని స్థానికంగా ఉండే లల్లుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భయ్యలాల్‌ను ధీరజ్ కోల్ తో కలిసి లల్లు ఇనుపరాడ్ తో కొట్టి చంపి మృతదేహాన్ని బావిలో పడేశారు. భయ్యాలాల్ మొబైల్ ఫోన్ కూడా అక్కడ దొరికింది” అని పోలీసులు తెలిపారు. మున్ని, లల్లు, ధీరజ్ ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు.