I am Groot: స్క్రీన్‌పై కనపడకుండానే 3 పదాల డైలాగ్‌ మాత్రమే చెప్పి రూ.132 కోట్లు సంపాదించిన నటుడు

ఆయన స్వరం ద్వారా గ్రూట్ పాత్ర ప్రాణం పోసుకుంది. కానీ తెరపై ఆయన ముఖం కనిపించలేదు. స్క్రీన్‌లో కనిపించకుండానే, పాత్రకు జీవం పోసే స్వరం మాత్రమే ఇచ్చాడు.

I am Groot: స్క్రీన్‌పై కనపడకుండానే 3 పదాల డైలాగ్‌ మాత్రమే చెప్పి రూ.132 కోట్లు సంపాదించిన నటుడు

Vin Diesel

Updated On : September 7, 2025 / 7:06 PM IST

I am Groot: నేటి కాలంలో సినిమా అతిపెద్ద వ్యాపారంగా మారిపోయింది. నటులు ఈ రోజుల్లో మిలియనీర్లు, బిలియనీర్లు అవుతున్నారు. పెద్ద సినిమాల్లో నటించడానికి కొందరు నటులు కోట్లాది రూపాయలు తీసుకుంటున్నారు. కానీ, ఒక నటుడు స్క్రీన్‌పై కనిపించకుండానే, కేవలం మూడు పదాల డైలాగ్ చెప్పి కోట్లాది రూపాయలు సంపాదించాడు. ఈ కథ ఏంటో తెలుసుకుందాం..

3 పదాలు.. $15 మిలియన్లు

ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించి పాపులర్ అయిన నటుడు విన్ డీజల్ గురించి భారత్‌లోనూ చాలా మందికి తెలుసు. ఆ సిరీస్‌లోని ఒక ఫిల్మ్‌కి దాదాపు $47 మిలియన్ సంపాదించాడు. మొత్తం ఆదాయం దాదాపు $200 మిలియన్.

మరో పాత్ర కూడా విన్‌ను పాపులర్ చేసింది. అదే మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్ లోని గ్రూట్ పాత్ర. 2014లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్ 1లో ఆయన తొలిసారి ఆ పాత్రకు వాయిస్‌ యాక్టింగ్ చేశాడు.

ఆ తరువాతి రెండు సీక్వెల్స్ లోనూ, అలాగే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్‌గేమ్ సినిమాలకు కూడా వాయిస్ యాక్టింగ్‌ చేశాడు. మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్‌లో విన్ డీజల్ తెరపై నటుడుగా కనిపించలేదు. ఆయన కేవలం గ్రూట్ పాత్రకు వాయిస్ మాత్రమే అందించాడు. అంటే ఆయన స్వరం ద్వారా గ్రూట్ పాత్ర ప్రాణం పోసుకుంది.

కానీ తెరపై ఆయన ముఖం కనిపించలేదు. స్క్రీన్‌లో కనిపించకుండానే, పాత్రకు జీవం పోసే స్వరం మాత్రమే ఇచ్చాడు. వాయిస్ యాక్టింగ్ అంటే సినిమాలు, యానిమేషన్, గేమ్స్ లాంటి ప్రాజెక్టుల్లో పాత్రకు భావోద్వేగాలతో, నటనతో స్వరం ఇవ్వడం. ఇలా విన్ డీజల్ వాయిస్ యాక్టింగ్ చేసి గ్రూట్ పాత్ర ద్వారా మరింత పాపులర్ అయ్యాడు.

ఏళ్ల తరబడి విన్ డీజల్ ఒక్కో చిత్రానికి గ్రూట్ పాత్రకు $13.5 మిలియన్ తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ దర్శకుడు జేమ్స్ గన్ దీనిని ఖండించాడు.

“ఐ యామ్ గ్రూట్”.. ఈ 3 పదాలే..
అయినప్పటికీ విన్ డీజల్ ఈ పాత్ర ద్వారా $12-15 మిలియన్ సంపాదించినట్టు (దాదాపు రూ.132 కోట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కేవలం వాయిస్‌ యాక్టింగ్‌కి ఇంత ఇవ్వడం ఓ రికార్డే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొత్తం మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్ లో గ్రూట్ ఎప్పుడూ మూడు మాటలే చెబుతాడు. అదే “ఐ యామ్ గ్రూట్”. అవి భిన్న స్వరాల్లో వినిపిస్తాయి. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2 లో మాత్రం ఒకసారి “వీ ఆర్ గ్రూట్” అన్నాడు. మార్వెల్ స్టూడియోస్ ఆయన ప్రాచుర్యం, ప్రపంచవ్యాప్త ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం ఇచ్చింది.

గ్రూట్ గా విన్ డీజల్ మరిన్ని పాత్రలు ఇవే..

  • 2014 నుంచి 2023 వరకు విన్ డీజల్ 5 చిత్రాల్లో గ్రూట్ పాత్రకు స్వరం అందించాడు.
  • అదే సమయంలో ఆయన ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్ సిరీస్ లో 4 చిత్రాల్లో నటించాడు.
  • ఆయన ఎక్స్‌ఎక్స్‌ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ చిత్రంలో కూడా నటించాడు.
  • ఈ సినిమాల విజయాలు ఆయనను ప్రపంచంలో అగ్రశ్రేణి సినిమా నటుడిగా నిలిపాయి.
  • త్వరలో విన్ డీజల్ తన పాత పాత్ర రిచర్డ్ బి రిడిక్ లోకి తిరిగి వస్తున్నాడు. ఈ పాత్రను ఆయన మొదటిసారి 2000లో విడుదలైన పిచ్ బ్లాక్ లో పోషించాడు. తరువాత ఈ పాత్రను ఆయన రెండు సీక్వెల్స్ లో కూడా కొనసాగించాడు.