Vesavi Dukkulu : వేసవి దుక్కులతో రైతులకు ఎన్నో లాభాలు – చీడపీడల నివారణ, పెరగనున్న భూసారం   

Deep Ploughs in Summer : వేసవి లో దుక్కులను చేసుకోవాలి. ప్రస్తుతం అడపా దడపా కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి.

Vesavi Dukkulu : వేసవి దుక్కులతో రైతులకు ఎన్నో లాభాలు – చీడపీడల నివారణ, పెరగనున్న భూసారం   

Deep Ploughs in Summer

Deep Ploughs in Summer : రబీ పంటలు పూర్తయ్యాయి. మరో నెలరోజుల్లో వానకాలం ప్రారంభం కాబోతున్నది. ఈ ఖాళీ సమయంలో వేసవి దుక్కులను చేసుకోవాలి. దీనివల్ల భూమిలో తేమశాతం పెరిగి, భూసార అభివృద్ధి అవుతుంది. మరోవైపు పురుగులు, తెగుళ్లను అరికట్టడమే కాకుండా, కలుపు మొక్కల నివారణ జరుగుతుందని తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు.

చాలా మంది రైతులు వానకాలం, యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరై పోయే ప్రమాదం ఉంది.

కాబట్టి వేసవి లో దుక్కులను చేసుకోవాలి. ప్రస్తుతం అడపా దడపా కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని మాగాణి, మెట్ట, బీడుభూములను దున్నుకోవాలి.  దీంతో  భూసారం పెరిగి, చీడపీడలు నశిస్తాయి. అంతే కాకుండా కలుపు మొక్కల నివారణ కూడా జరుగుతుందని రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, డా. ఆర్. శ్రీనివాస రావు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు