Lunar Eclipse 2025: Lunar Eclipse 2025: ఆకాశంలో అద్భుతం.. సంపూర్ణ చంద్రగ్రహణం.. ప్రత్యేకతలు ఇవే.. ఇలా చూసేయండి..
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. మరి ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు.. ఇప్పుడు తెలుసుకుందాం..

Lunar Eclipse 2025: ఖగోళ అద్భుత దృశ్యం సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటల 57నిమిషాలకు గ్రహణం ఏర్పడింది. దీన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా పిలుస్తారు. బ్లడ్ మూన్ అని కూడా అంటారు. దీన్ని ఖగోళ అద్భుతంగా సైంటిస్టులు అభివర్ణిస్తారు. ప్రతి ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడటం సర్వ సాధారణం. ఇది రెండో చంద్రగ్రహణం.
తెల్లవారుజామున 1.26 గంటలకు గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరం అవసరం లేకుండానే నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక గ్రహణం సమయంలో ధ్యానం, జపం చేసుకోవడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.
సంపూర్ణ చంద్రగ్రహణం భారత్ లోనూ స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలాంటి పరికరం లేకుండానే గ్రహణాన్ని నేరుగా చూడొచ్చన్నారు. బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూసివేశారు. అయితే, శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంచారు. ఈ ఆలయంలో నవగ్రహ అలంకార కవచం వల్ల గ్రహణ ప్రభావం గుడిపై పడదని పండితులు చెబుతున్నారు. రోజులాగే రాత్రి 9 గంటలకు ఆలయం మూసివేసి, గ్రహణ సమయంలో రాత్రి 11 గంటలకు తెరిచి గ్రహణ కాల అభిషేకాలు, శాంతి పూజలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
అందుకే.. గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేత..
గ్రహణాలు ఏర్పడినపుడు సూర్య, చంద్రుల నుంచి విడుదలయ్యే ప్రతికూల శక్తి ఆలయాల్లోని విగ్రహాల శక్తిని కోల్పోయేలా చేస్తుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. అందుకే ఆలయంలోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా తలుపులు మూసివేస్తారట.
చంద్రగ్రహణం సమయంలో శివారాధన చాలా శక్తిమంతమైనదని పండితులు చెబుతున్నారు. ఓం నమః శివాయ అనే మంత్రం రాహు-కేతువుల ప్రభావాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గం గణపతయే నమః మంత్రాలు ప్రతికూల శక్తులను తొలగిస్తాయని వివరించారు.
* ఖగోళ అద్భుత దృశ్యం
* ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు బ్లడ్ మూన్
* 3 గంటల 28 నిమిషాల పాటు చంద్ర గ్రహణం
* 42 నిమిషాలు పాటు సంపూర్ణ చంద్ర గ్రహణం
* రాత్రి 9.57 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం
* రాత్రి 11 నుంచి 11.41 గంటల వరకు బ్లడ్ మూన్
* అర్థరాత్రి 1.26 గంటలకు చంద్రగ్రహణం పూర్తి
* ఈ ఏడాదిలో రెండోసారి సంపూర్ణ చంద్రగ్రహణం
* చంద్రగ్రహణం కారణంగా దేశంలోని పలు ఆలయాలు మూసివేత
* రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత తెరుచుకోనున్న ఆలయాలు
* వందేళ్లకు ఒకసారి మాత్రమే కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం
* ఆసియా, ఆఫ్రికా దేశాలపై సంపూర్ణ చంద్ర గ్రహణ ప్రభావం
* భారత్ లోని చాలా ప్రాంతాల నుంచి చంద్రగ్రహణాన్ని చూసే అవకాశం
Also Read: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఏం చేయాలి? అస్సలు చేయకూడని తప్పులు ఏంటి?