Ketu grasta Chandra Grahan: మార్చి 3.. కేతుగ్రస్త చంద్ర గ్రహణం.. ఈ రాశుల వాళ్లు జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మరీ ముఖ్యంగా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని, బయటకు రావొద్దని జాగ్రత్తలు చెప్పారు.
Representative Image (Image Credit To Original Source)
- సైకియాట్రిక్ పేషంట్స్ జాగ్రత్తగా ఉండాలి
- నెర్వ్ రిలేటడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి
- మంగళవారం గ్రహణం వస్తుంది కాబట్టి సోమవారమే రెమెడీ చేసుకోవాలి
Ketu grasta Chandra Grahan: మార్చి 3వ తేదీ మంగళవారం కేతుగ్రస్త చంద్ర గ్రహణం. మరి గ్రహణం ఎఫెక్ట్ ఎంత, ఎవరెవరిపై గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి రెమెడీలు పాటించాలి, పండితులు ఏం చెబుతున్నారు..తెలుసుకుందాం..
కేతుగ్రస్త చంద్ర గ్రహణం ఎఫెక్ట్ మెయిన్ గా ఎవరికి అంటే.. ఎవరి మదర్స్ కు అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్లు కొంచెం కేర్ ఫుల్ గా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఇక సైకియాట్రిక్ పేషంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. నెర్వ్ రిలేటడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కర్కాటక రాశి, సింహ రాశి, కన్య రాశి, మకర రాశి, మీన రాశి, వృషభ రాశి వాళ్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఈ రాశుల వాళ్ల మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని, ముందే రెమెడీ చేసుకోవాలన్నారు.
మంగళవారం గ్రహణం వస్తుంది కాబట్టి సోమవారమే రెమెడీ చేసుకోవాలని పండితులు సూచించారు. సోమవారం రాత్రి గాజు గ్లాస్ లో నీళ్లు తీసుకుని కొంచెం పాలు కలిపి చంద్రుడికి నీళ్లు ఇవ్వాలన్నారు. ఇక సోమవారం కుదిరితే వైట్ కలర్ ఫుడ్ (ఇడ్లీ, దోస, పెరుగన్నం) దానం ఇవ్వలన్నారు. పేదలకన్నా దానం ఇవ్వండి లేదా కుక్కలకి, కాకుల కన్నా పెట్టాలన్నారు.
ఇక సోమవారం, మంగళవారం శివుడిని ఎక్కువగా పూజించాలన్నారు. శివుడి పాటలు పెట్టుకుని వినొచ్చు. మరీ ముఖ్యంగా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలని, బయటకు రావొద్దని జాగ్రత్తలు చెప్పారు. కర్కాటక, సింహ, కన్య, మకర, మీన, వృషభ రాశి వాళ్లు.. గర్భిణులు గ్రహణం సమయంలో బయటకు రావొద్దన్నారు. గ్రహణం ముగిశాక తల స్నానం చేయాలి. వైట్ కలర్ ఫుడ్ ఎంత వీలైతే అంత దానం చేయాలి. శివుడిని బాగా పూజించాలి. స్నానం చేసే నీళ్లలో గ్రీన్ కలర్ గ్రాస్ గరిక ను కలపాలి. ఈ రెమెడీ చేస్తే చాలు అంతా సెట్ అయిపోతుంది, ఎఫెక్స్ట్ ఏమీ ఉండవు అని పండితులు తెలిపారు. మార్చి 10వ తేదీ వరకు కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏమీ ఉండవు అని చెప్పారు.
