Viral Video: వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క వచ్చింది.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ యువకుడి ట్వీట్
ఫుడ్ సగం తిన్నాక అందులో మాంసం ఉందని తెలుసుకుని తిన్న ఆహారాన్ని కక్కేయాలో, అరగదీసుకోవాలో తెలియక..
- T Venkateshwarlu
- Published on- May 15, 2024 / 04:19 PM IST
Chicken In Veg Biryani
ఫుడ్ డెలివరీ యాప్‌లలో అధిక శాతం మంది బిర్యానీల వంటి మాంసాహార పదార్థాలకు ఆర్డర్ ఇస్తుంటారు. అయితే, కొంత మందికి మాంసాహారం అంటే పడదు. దీంతో శాకాహార ఐటెమ్స్ ఆర్డర్లూ వస్తుంటాయి. డెలివరీ అందుకున్నాక ఒక్కోసారి శాకాహారంలో మాంసాహారం కలిసి వస్తుండడంతో వెజిటేరియన్లు వికారానికి గురవుతున్నారు.
ఫుడ్ సగం తిన్నాక అందులో మాంసం ఉందని తెలుసుకుని తిన్న ఆహారాన్ని కక్కేయాలో, అరగదీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఇటువంటి పరిస్థితే తాజాగా మరో శాకాహారికి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
పూణేలోని కార్వే నగర్‌లోని పీకే బిర్యానీ హౌస్ నుంచి పనీర్ బిర్యానీ తెప్పించుకున్నాడు పంకజ్ శుక్లా. అయితే, అందులో చికెన్ ముక్క కనపడింది. దీంతో ఈ విషయం కంపెనీకి తెలిపి రీఫండ్ తీసుకున్నానని అన్నాడు. అయినప్పటికీ తాను శాకాహారి కావడంతో ఈ ఘటన తన మనోభావాలను దెబ్బతీసిందని చెప్పాడు.
దీనిపై జొమాటో స్పందించిస్తూ పంకజ్ కు రిప్లై ఇచ్చింది. తాము కస్టమర్ల మనోభావాల విషయంలో రాజీపడబోమని చెప్పింది. పంకజ్ ఇచ్చిన ఆర్డర్‌కు సంబంధించిన వివరాలు పంపితే దాన్ని చెక్ చేస్తామని పేర్కొంది.
Also Read: నాకేమంత వయసైంది.. జస్ట్ 102 ఏళ్లే.. కుర్రాళ్లతో క్రికెట్ ఆడుతున్న కశ్మీరీ తాతయ్య..
