Kashmir Cricketer : నాకేమంత వ‌య‌సైంది.. జ‌స్ట్ 102 ఏళ్లే.. కుర్రాళ్ల‌తో క్రికెట్ ఆడుతున్న క‌శ్మీరీ తాత‌య్య‌..

ఆట‌లు ఆడేందుకు వ‌య‌సు అడ్డంకి కాద‌ని నిరూపిస్తున్నాడు ఈ తాత.

Kashmir Cricketer : నాకేమంత వ‌య‌సైంది.. జ‌స్ట్ 102 ఏళ్లే.. కుర్రాళ్ల‌తో క్రికెట్ ఆడుతున్న క‌శ్మీరీ తాత‌య్య‌..

A 102 Year Old Man Found Playing Cricket In Reasi District

Updated On : May 15, 2024 / 11:59 AM IST

ఆట‌లు ఆడేందుకు వ‌య‌సు అడ్డంకి కాద‌ని నిరూపిస్తున్నాడు ఈ తాత. ఆత్మ విశ్వాసం, శ‌క్తి ఉంటే చాలున‌ని అంటున్నాడు. కుర్రాళ్ల‌తో పోటీప‌డుతూ క్రికెట్ ఆడుత‌న్నాడు క‌శ్మీర్ కు చెందిన హజి కరమ్ దిన్. 102 ఏళ్ల వ‌య‌సులోనూ త‌న బ్యాటింగ్ స్కిల్స్‌ను చూపిస్తున్నాడు. ఆట‌లు ఆడితే ఫిట్‌నెస్ ఉంటుంద‌నే సందేశాన్ని ఆయ‌న యువ‌తరానికి అందిస్తున్నాడు.

కాళ్ల‌కు ప్యాడ్లు, చేతుల‌కు గ్లౌజులు తొడుక్కుని బ్యాట్ ప‌ట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఓ కుర్రాడు బౌలింగ్ చేస్తుండ‌గా తాత చ‌క్క‌గా బ్యాటింగ్ చేశాడు. స్థానికంగా ఉండే కుర్రాళ్ల‌కు ఇన్స్‌పిరేష‌న్‌గా నిలుస్తున్నాడు. కాగా.. ఇటీవ‌ల జ‌రిగిన రెండో ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ క‌ర‌మ్ దిన్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు. ఇంకెందు ఆల‌స్యం తాత‌య్య బ్యాటింగ్‌ను ఓ సారి చూసేయండి..

Virat Kohli : నన్ను చూస్తే నీకు న‌వ్వొస్తుందా పంత్‌..! వెళ్లి కూర్చో.. లేదంటే బ్యాట్‌తో కొడ‌తా : విరాట్ కోహ్లి