రామ్‌దేవ్‌ బాబాకు చాలా పలుకుబడి ఉంది.. దాన్ని సరిగ్గా వాడుకోవాలి: సుప్రీంకోర్టు

Supreme Court: పతంజలి ఆయుర్వేదం ఇచ్చిన తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

Ramdev Baba

యోగా గురు రామ్‌దేవ్‌ బాబాకు చాలా పలుకుబడి ఉందని, దానిని సరిగ్గా వాడుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. పతంజలి ఆయుర్వేదం ఇచ్చిన తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్, బాలకృష్ణ ఇచ్చిన యాడ్స్ కేసులో సుప్రీంకోర్టు ఇవాళ విచారణ కొనసాగించింది. రామ్‌దేవ్ బాబా యోగా కోసం చాలా చేశాడని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

దీంతో జస్టిస్ హిమ కోహ్లీ స్పందిస్తూ.. యోగా కోసం ఆయన చేసింది మంచిదే కానీ పతంజలి ఉత్పత్తుల విషయం వేరేనని అన్నారు. న్యాయవాదులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎ అమానుల్లా ధర్మాసనానికి రామ్‌దేవ్‌ తరఫున సీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్ తన వాదనలు వినిపించారు.

పతంజలి ఇప్పటికే తన ప్రకటనలు నడుస్తున్న టీవీ ఛానెల్‌లకు లేఖ రాసిందని చెప్పారు. అంతేగాక, కొన్ని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేసిందని తెలిపారు. దీంతో ఆయా ఉత్పత్తుల స్టాక్‌లపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని పతంజలిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 Also Read: దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ట్రెండింగ్ వార్తలు