AB Venakteswar Rao: ప్రభుత్వ షోకాజుపై గట్టి వివరణ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ షోకాజుపై గట్టి వివరణ ఇచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు

AB Venakteswar Rao: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ అనుమతి లేకుండా పెగాసస్ సాఫ్ట్ వేర్ కి సంబంధించి మార్చి 21న మీడియా సమావేశం నిర్వహించిన సీనియర్ ఐపిఎస్ ఎబి వెంకటేశ్వరావుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం ఐపీఎస్ అధికారి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా మీడియా సమావేశం నిర్వహించడం నియమాలకు విరుద్ధమని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ మార్చి 22నే ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వగా.. ఈ విషయం మంగళవారం నాడు వెలుగులోకి వచ్చింది. ఈవ్యవహారంపై బుధవారం ఏబీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ..మీడియా సమావేశం నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన నోటీసుకు గట్టి వివరణ ఇచ్చారు.

Also Read:AP Cabinet: రాజీనామాకు మంత్రులు రెడీ..!

వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయన్న ఎబి వెంకటేశ్వరరావు తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న..రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు. తాను నేను ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే మీడియా సమావేశంలో చెప్పానని..ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలని కూడా వివరణలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయని..అయితే తాను ఆనాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని స్పష్టం చేశారు.

Also read:Palnadu District: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

“వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా నాపై, నా కుటుంబం పై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటాను” అంటూ ఏబీ వెంకటేశ్వరరావు వివరణ లేఖలో పేర్కొన్నారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాధమిక హక్కు మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని ఆయన తెలిపారు. అయినా మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపానని ఆసమయంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్ ను కూడా తాజా వివరణలో పేర్కొన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ఇదిలాఉంటే మార్చి 22న ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసు అందుకున్న ఏబీ వెంకటేశ్వరరావు వారంలోగా వివరణ ఇవ్వాలని ఆనాటి నోటీసులో పేర్కొంది ప్రభుత్వం. నిర్దేశిత సమయంలోగా వివరణ ఇవ్వని పక్షంలో నిబంధనలు ఉల్లంఘించినట్లుగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఆ నోటీసుపై ఏబీ వెంకటేశ్వరరావు నిర్ణిత సమయానికి స్పందించారా? లేదా? అనే విషయం మాత్రం తెలియరాలేదు.

Also read:CM YS Jagan: రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీ బిజీ: మధ్యాహ్ననికి తాడేపల్లి చేరుకోనున్న సీఎం జగన్

ట్రెండింగ్ వార్తలు