Perni Nani : రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా : సీఎం జగన్ సమక్షంలో పేర్ని నాని సంచలన ప్రకటన

ఇక నేను సీఎం జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో, లేదో అంటూ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు.

Perni Nani – Political Retirement : మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నానంటూ ప్రకటించారు. తన రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తు పేర్ని నాని ఎమోషన్ అయ్యారు. ఇక తాను జగన్ తో వేదిక పంచుకునే అవకాశం వస్తుందో, లేదో అన్నారు.. కృష్ణా జిల్లా బందరు పోర్టు (Bandar Port) శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ (CM Jagan) ఎదురుగానే ఈ ప్రకటన చేయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

కృష్ణా జిల్లా (Krishna District) బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్‌ సమక్షంలో పేర్ని నాని ఈ ప్రకటన చేశారు. ఈ సభలోపాల్గొన్న పేర్ని నాని మాట్లాడుతూ ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి సీఎం జగన్‌తో తాను సమావేశం అవుతానో లేదో నాకే తెలియదు. తప్పదు.. ఆయన ఈ బాధ భరించాల్సిందే అంటూ పేర్ని నాని పేర్కొన్నారు.

నా కుమారుడికి టికెట్ ఇస్తారో, ఇవ్వరో జగన్ ఇష్టం
ఎన్నికల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు 10tvతో పేర్ని నాని చెప్పారు. ”ఎమ్మెల్యే గా సీఎం ముందు సభలో మాట్లాడటం ఇదే చివరి మీటింగ్ అనుకుంటున్నా. జగన్ సీఎంగా ఉండగా నాకు ఉన్నది ఇంక 10 నెలలే.మళ్ళీ ఆయన ముందు మీటింగ్ లో మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. మచిలీపట్నంకు కావాల్సినవన్నీ చేశాను. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పని చేస్తా. నా కుమారుడికి టికెట్ ఇస్తారో, ఇవ్వరో జగన్ ఇష్టం. ఎవరికి ఇచ్చినా నా కుటుంబం పార్టీ జెండా మోస్తుంద”ని అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు