Ather Electric Scooter : అత్యంత సరసమైన ధరలో ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఎంతలో ఉండొచ్చు? లీకైన స్పెషిఫికేషన్లు ఇవేనా?

Ather Electric Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. అత్యంత సరసమైన ధరకే మార్కెట్లోకి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టనుంది.

Ather Electric Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. అత్యంత సరసమైన ధరకే మార్కెట్లోకి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో 450X ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఏథర్ ఎనర్జీ విక్రయిస్తోంది. అతి త్వరలో అత్యంత సరసమైన (రూ. 1 లక్షలోపు) ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏథర్ 450 ప్లస్ ధర రూ.1,18,895గా ఉండగా.. ఏథర్ 450X ధర రూ. 1,41,905గా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ రెండూ మోడల్ ఈవీ స్కూటర్లపై న్యూఢిల్లీలో ధరలుగా ఉన్నాయి. FAME II, రాష్ట్ర రాయితీలు, Ather డాట్/పోర్టబుల్ ఛార్జర్, పనితీరు అప్‌గ్రేడ్ ఉన్నాయి. ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. బహుశా ఈ కొత్త ఈవీ స్కూటర్ ధర రూ. 1 లక్షలోపు మోడల్‌గా ఉండవచ్చు.

ఏథర్ ఎనర్జీ 450 ప్లస్ 3.7kWh లిథియం-అయాన్ బ్యాటరీతో 5.4kW/22Nm పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో రానుంది. 450X 3.7kWh లిథియం-అయాన్ బ్యాటరీతో 6.2kW/26Nm పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను అందిస్తుంది. 450 ప్లస్ 60కి.మీ, 85 కి. మీ మధ్య రియల్ డిస్టెన్స్ కలిగి ఉంది. అయితే, 450X మోడల్ ఈవీ స్కూటర్ వేగం 65కి.మీ నుంచి 105 కి.మీ మధ్య ఉంటుంది.

Ather working on more affordable, sub-Rs 1 lakh electric scooter

Read Also : Ather Energy Electric Scooter: ఏథర్ ఎనర్జీ నుండి 450ఎక్స్ మూడవ తరం ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర ఎంతంటే?

సరసమైన ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ల పరంగా గణనీయమైన మార్పులతో రానుంది. అతి త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. కంపెనీ ఏదైనా కొత్త ప్రొడక్టుతో వచ్చే ముందు చాలా R&D, రోడ్ టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు పనిచేయకపోవడం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఏదైనా ప్రొడక్టు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వరకు ఏథర్ అలాంటి మోడల్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురాదు.

2022లో కంపెనీ 59,413 యూనిట్లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ.. 224శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023లో అదే ఉత్సాహంతో మార్కెట్ ప్రారంభించింది. ఏథర్ సేల్స్ 329శాతం పెరిగి 12,149 యూనిట్ల వద్ద ఉన్నాయి. మరో పోటీదారు కంపెనీ ఓలా (OLA) ఇటీవలే ఎంట్రీ లెవల్ S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మోడల్ బ్యాటరీ ప్యాక్‌పై ఆధారపడి S1 ఎయిర్ ధర రూ. 85వేలు, రూ.1.10 లక్షల మధ్య (సబ్సిడీలతో కలిపి) ఉంటుందని చెప్పవచ్చు.

Read Also : Citroen Aircross SUV : ఫ్రెంచ్ సిట్రోయెన్ రెండు SUV మోడళ్లపై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు.. మరెన్నో బెనిఫిట్స్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు