Citroen Aircross SUV : ఫ్రెంచ్ సిట్రోయెన్ రెండు SUV మోడళ్లపై రూ. 2లక్షల వరకు డిస్కౌంట్లు.. మరెన్నో బెనిఫిట్స్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

Citroen Aircross SUV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ తమ కొత్త కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Citroen Aircross SUV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) తమ కొత్త కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. సిట్రోయెన్ కంపెనీ కొత్త మోడల్ SUV కార్లలో C5 ఎయిర్‌క్రాస్ SUV, C3 ఎయిర్‌క్రాస్‌లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. సిట్రోయెన్ అందించే రెండు మోడళ్లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లతో పాటు మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది. Citroen C5 Aircross SUV పూర్తిగా షైన్ వేరియంట్‌లో వస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 37.17 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది.

సిట్రోయెన్ వాహనంపై రూ. 2 లక్షల విలువైన హామీ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ.. 2022లో తయారైన C5పై మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. Citroen C3 మూడు వేరియంట్లలో వస్తోంది. అందులో లైవ్ ధర రూ. 5.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటే.. ఫీల్ ధర రూ. 7.20 లక్షలు (ఎక్స్-షోరూమ్), ఫీల్ టర్బో ధర రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనున్నాయి.

Citroen Aircross SUV : French Automaker Citroen Benefits, discounts up to Rs 2 lakh

Read Also : 2023 Honda City Facelift : హోండా కార్స్ ఇండియా నుంచి కొత్త కారు ఇదే.. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్..! ధర ఎంత ఉండొచ్చుంటే?

C3 మోడల్ SUV కారు ధర రూ. 50వేల విలువైన బెనిఫిట్స్ అందిస్తోంది. 100శాతం ఆన్-రోడ్ ఫండింగ్‌కు హామీ ఇచ్చింది. Citroen C5 Aircross SUV, Citroen C3పై ప్రయోజనాలతో పాటు డిస్కౌంట్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. C5 ఎయిర్‌క్రాస్ SUV 2.0-లీటర్ DW10 FC డీజిల్ ఇంజన్ (170PS/400Nm) 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. C3లో రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. 5-స్పీడ్ MTతో 1.2-లీటర్ పెట్రోల్ (82PS/115Nm), 6-స్పీడ్ MTతో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ (110PS/190Nm) ఉంటాయి.

సిట్రోయెన్ మూడో మోడల్ e-C3ని త్వరలో లాంచ్ కానుంది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కోసం ప్రీ-బుకింగ్‌లు గత నెలలో రూ. 25వేల టోకెన్ మొత్తానికి ప్రారంభమయ్యాయి. e-C3 29.2kWh లిథియం-అయాన్ ఎయిర్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్‌తో పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (57PS/143Nm)ని ఉపయోగిస్తుంది. ఈ మోడల్ కారును ఒకే పూర్తి ఛార్జింగ్‌తో 320కిలోమీటర్లు దూసుకెళ్లగలదని కంపెనీ పేర్కొంది.

Read Also : Top 5 Upcoming Cars 2023 : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? 2023లో టాప్ 5 అప్‌కమింగ్ కార్లు ఇవే.. ఏ కారు మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు