Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై రాళ్ల దాడి

జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులో జోగి రమేశ్ ఇళ్లు ఉంటుంది.

అక్కడి గుర్తు తెలియని వ్యక్తులు AP39KD3267 కారులో వచ్చినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్ ఇంటిముందే కారు ఆపి, తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోలీస్ కానిస్టేబుల్ పట్ల దుండగులు దురుసుగా ప్రవర్తించారు.

జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మాజీమంత్రి జోగిరమేశ్ ఇంటిపై దాడి చేసింది టీడీపీ, జనసేన వాళ్లేనని వైసీపీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం దాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అలాగే, ఎన్నికల ఫలితాల అనంతరం కూడా దాడులు జరిగాయి. ఇవి ఇప్పటికీ ఆగడం లేదు.

రుషికొండపై నిర్మాణాల గురించి వైఎస్సార్సీపీ వివరణ

ట్రెండింగ్ వార్తలు